శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By selvi
Last Updated : శనివారం, 6 మే 2017 (09:37 IST)

ఉచిత వైఫై పుణ్యం.. 30 వేలమంది పోర్న్ సైట్లు, వీడియోలు తిలకిస్తున్నారట!

ఉచితంగా వైఫై సేవలతో మేలెంత అనే విషయాన్ని పక్కనబెడితే.. వైఫై సేవలు పక్కదారి పడుతున్నాయి. కావాల్సిన పని నిమిత్తం ఉపయోగించాల్సిందిపోయి వేలాదిమంది యువతీ యువకులు పోర్న్‌సైట్లను చూస్తున్న ఉదంతం ముంబై సిటీలో

ఉచితంగా వైఫై సేవలతో మేలెంత అనే విషయాన్ని పక్కనబెడితే.. వైఫై సేవలు పక్కదారి పడుతున్నాయి. కావాల్సిన పని నిమిత్తం ఉపయోగించాల్సిందిపోయి వేలాదిమంది యువతీ యువకులు పోర్న్‌సైట్లను చూస్తున్న ఉదంతం ముంబై సిటీలో బయటపడింది.

డిజిటల్ ఇండియా ప్రగతి ధ్యేయంగా కేంద్రం దేశంలోని పలు నగరాల్లో ఉచితంగా వైఫై సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. 
 
ముంబై నగరంలో మూడు లక్షలమందికిగాను 510 ప్రాంతాల్లో ఉచిత వైఫై సేవలు అందుబాటులో ఉన్నాయి. కానీ ఫ్రీ వైఫైతో పదిశాతం మంది అంటే 30 వేలమంది పోర్న్ సైట్లు, వీడియోలు తిలకిస్తున్న మహారాష్ట్ర ఐటీ శాఖ వెల్లడించింది. దీంతో షాకైన ఐటీ అధికారులు ఫోర్న్ సైట్లను బ్లాక్ చేస్తున్నా కొత్త డొమైన్‌తో మళ్లీ పుట్టుకొస్తున్నాయని చెప్తున్నారు.