భారత్ మార్కెట్లోకి ఫీచర్ ఫోన్ 3310.. దేశంలో లేదా చైనాలో తయారీ
భారత్ మార్కెట్లోకి ఫీచర్ ఫోన్ 3310తో పాటు హెచ్ఎండీ గ్లోబల్ నోకియా 3, నోకియా 5, నోకియా 6 ఫోన్లను విడుదల చేసేందుకు నోకియా రెడీ అవుతోంది. బార్సిలోనాలో జరుగుతున్న వరల్డ్ మొబైల్ కాంగ్రెస్‌లో ఈ ఫోచర్ ఫోన్‌న
భారత్ మార్కెట్లోకి ఫీచర్ ఫోన్ 3310తో పాటు హెచ్ఎండీ గ్లోబల్ నోకియా 3, నోకియా 5, నోకియా 6 ఫోన్లను విడుదల చేసేందుకు నోకియా రెడీ అవుతోంది. బార్సిలోనాలో జరుగుతున్న వరల్డ్ మొబైల్ కాంగ్రెస్‌లో ఈ ఫోచర్ ఫోన్‌ను నోకియా ప్రదర్శించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ ఫోన్లను భారత్ మార్కెట్లోకి తెచ్చేందుకు సిద్ధమవుతున్నట్టు హెచ్ఎండీ గ్లోబల్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ అజయ్ మెహతా పేర్కొన్నారు.
మే చివరి వారం లేదంటే జూన్ తొలి వారంలో భారత విపణిలోకి విడుద చేస్తామంటూ అజయ్ మెహతా తెలిపారు. ఆండ్రాయిడ్ ఫోన్ కన్నా ముందే 3310ను భారత్ మార్కెట్లోకి తెస్తామని పేర్కొన్నారు. ఈ ఫోన్లన్నీ భారత్‌లోనే తయారు చేస్తామని చెప్పుకొచ్చారు. ఇందుకోసం ఫాక్స్‌కాన్‌తో కలిసి పనిచేస్తామని, వారు కాదంటే వియత్నాం, లేదంటే చైనాలో తయారు చేస్తామని వివరించారు.
కాగా 2000 సంవత్సరంలో మార్కెట్లో విడుదలై ట్రెండ్ సృష్టించిన ఐకానిక్ మోడల్ అయిన నోకియాను స్వల్ప మార్పులతో నోకియా 3310 ఫోన్‌గా అందుబాటులోకి రానుంది. అయినా ఇది పాత లుక్‌ను పోలి ఉంటుంది. చాలా తేలికగా, స్లిమ్‌గా ఫీజికల్ కీబోర్డును కలిగివుంటుంది. కొత్త ఫోనులో ఎరుపు, ఆకుపచ్చ, పసుపు రంగులతో పాటు బూడిద, నలుపు, రంగులు కూడా అందుబాటులో ఉంటుంది.