శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 19 జనవరి 2017 (06:53 IST)

రిలయన్స్‌ జియో ఫీచర్‌ ఫోన్‌ ఇదే... ధర ఎంతో తెలుసా?

రిలయన్స్ ఇండస్ట్రీస్ ఏది చేసినా సంచలనంగా మారుతోంది. ఈ సంస్థ తాజాగా ఫీచర్ ఫోన్‌ను అతి తక్కువ ధరకు ప్రవేశపెట్టనుంది. "రిలయన్స్ జియో 4జి వోల్టీ" (VoLTE) పేరుతో వచ్చే ఈ ఫోన్‌కు సంబంధించి ఫోటో ఒకటి సోషల్ మ

రిలయన్స్ ఇండస్ట్రీస్ ఏది చేసినా సంచలనంగా మారుతోంది. ఈ సంస్థ తాజాగా ఫీచర్ ఫోన్‌ను అతి తక్కువ ధరకు ప్రవేశపెట్టనుంది. "రిలయన్స్ జియో 4జి వోల్టీ" (VoLTE) పేరుతో వచ్చే ఈ ఫోన్‌కు సంబంధించి ఫోటో ఒకటి సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. 
 
నిజానికి రిలయన్స్ జియో కస్టమర్ల సంఖ్యను పెంచుకునేందుకు వీలుగా అతి తక్కువ ధరకు ఫీచర్ ఫోన్‌ను ప్రవేశపెట్టనున్నట్టు రిలయన్స్ ప్రకటించింది. అప్పటి నుంచి ఆ ఫోన్‌ ఎలా ఉంటుందో అందరికీ ఆసక్తి నెలకొంది. 
 
ఈ నేపథ్యంలో ఈ ఫోన్‌కు సంబంధించిన ఫొటోలు అనధికారికంగా బయటి కొచ్చాయి. కీబోర్డుతో వచ్చే ఈ మొబైల్‌లో మైజియో, జియో టీవీ, జియో సినిమా, జియో మ్యూజిక్‌ కోసం ప్రత్యేక బటన్స్‌ కూడా ఉన్నాయి. ఈ ఫోన్ ధర సుమారుగా రూ.1500 ఉంటుందని మార్కెట్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి.