రిలయన్స్‌ జియోకు ఫైన్ వేసింది ఎంతో తెలుసా?

రిలయన్స్ జియోకు అపరాధపడింది. ఈ కంపెనీ సేవలు అందుబాటులోకి వచ్చాక... టెలికాం రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. అంతేకాకుండా, 'వెల్‌కమ్ ఆఫర్‌'ను మార్చి 31, 2017 వరకూ పొడిగిస్తున్నట్లు ప్రకట

reliance jio
pnr| Last Updated: శనివారం, 3 డిశెంబరు 2016 (10:09 IST)
రిలయన్స్ జియోకు అపరాధపడింది. ఈ కంపెనీ సేవలు అందుబాటులోకి వచ్చాక... టెలికాం రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. అంతేకాకుండా, 'వెల్‌కమ్ ఆఫర్‌'ను మార్చి 31, 2017 వరకూ పొడిగిస్తున్నట్లు ప్రకటించి కస్టమర్ల మన్ననలు పొందిన రిలయన్స్ జియో చిక్కుల్లో ఇరుక్కుంది. జియోను మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లడం కోసం జాతీయ పత్రికల్లో యాడ్ ఇవ్వాలని జియో భావించింది.

అయితే ఆ యాడ్‌‌లో ప్రధాని నరేంద్ర మోడీ ఫోటోను ఉపయోగించారు. ఆ యాడ్‌కు సంబంధించిన ఫోటో బయటికొచ్చింది. ప్రధాని ఫోటోను వినియోగించేందుకు ఎలాంటి అనుమతినివ్వలేదని ఇప్పటికే అధికార వర్గాలు ప్రకటించాయి. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ అడ్వర్‌టైజ్‌మెంట్స్ అనుమతి లేకుండా ఈ ఫోటోను ముద్రించినందుకు జియో యాజమాన్యానికి జరిమానా విధించారు. ఆ జరిమానా 500 రూపాయలు.

ఇలా ప్రధాని ఫోటోను ఉపయోగించుకోవడం చట్ట ఉల్లంఘన కిందకు వస్తుందని, విచారించి తగిన చర్యలు తీసుకుంటామని సదరు మంత్రిత్వ శాఖ తెలిపింది. సెక్షన్ 3లోని యాక్ట్ ప్రకారం ప్రభుత్వ పదవుల్లో ఉన్న వారి పేర్లను, నినాదాన్ని కేంద్ర ప్రభుత్వ అనుమతి లేకుండా, తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసం వినియోగించడం నేరం. రాష్ట్రపతి, ప్రధానమంత్రి, రాష్ట్రాల గవర్నర్లు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, మహాత్మ గాంధీ, ఇందిరా గాంధీ, జవహర్ లాల్ నెహ్రూ, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్, అశోకచక్ర వంటి చిహ్నాలను, పేర్లను వినియోగించడం చట్ట ఉల్లంఘన కిందకు వస్తుంది.దీనిపై మరింత చదవండి :