గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 25 జులై 2017 (10:20 IST)

రిలయన్స్ జియో సబ్‌స్క్రైబర్లలో ఏపీ అగ్రస్థానం.. మూడో స్థానంలో తమిళనాడు

ఉచిత డేటా పేరిట సంచలనం సృష్టించిన రిలయన్స్ జియోకు వినియోగదారులు రోజు రోజుకీ పెరిగిపోతున్నారు. జియో వినియోగదారులు నెలకు 125 కోట్ల జీబీని వాడేస్తున్నారు. రోజుకు 250 కోట్ల నిమిషాల వాయిస్ కాల్స్‌ను ఉపయోగి

ఉచిత డేటా పేరిట సంచలనం సృష్టించిన రిలయన్స్ జియోకు వినియోగదారులు రోజు రోజుకీ పెరిగిపోతున్నారు. జియో వినియోగదారులు నెలకు 125 కోట్ల జీబీని వాడేస్తున్నారు. రోజుకు 250 కోట్ల నిమిషాల వాయిస్ కాల్స్‌ను ఉపయోగిస్తున్నట్టు జియో పేర్కొంది.  
 
ఈ నేపథ్యంలో రిలయన్స్ జియో సబ్‌స్క్రైబర్ల విషయంలో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో నిలిచింది. రిలయన్స్ జియో 1.06 కోట్ల మంది వినియోగదారులతో ఏపీ సర్కిల్ తొలి స్థానంలో నిలవగా, 90.1 లక్షలతో గుజరాత్ రెండోస్థానం దక్కించుకుంది. 90 లక్షల మంది వినియోగదారులతో తమిళనాడు ఆ తర్వాతి స్థానంలో నిలిచింది. 
 
ఇక దేశ రాజధాని ఢిల్లీ 80.4 లక్షలతో నాలుగో స్థానంలో నిలిచింది. అలాగే దేశ వాణిజ్య నగరం ముంబై 50.6లక్షలతో ఐదో స్థానాన్ని దక్కించుకుంది. జూన్ 30తో ముగిసిన త్రైమాసికానికి జియోకు కొత్తగా 1.4కోట్ల మంది వినియోగదారులు చేరారు. దీంతో జియో వినియోగదారుల మొత్తం సంఖ్య 12.34 కోట్లకు చేరుకుంది.
 
ఇదిలా ఉంటే.. రిలయన్స్ సంస్థ అధినేత ముఖేష్ అంబానీ జియో ఉచితంగా 4జి ఫీచర్ ఫోన్‌ను అందజేయనున్నట్టు ప్రకటించారు. ఈ ఫోన్‌లో ఫ్రీ నెట్, ఫ్రీ వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు. ఈ ఫోన్‌ను ఇటీవల ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. అయితే, రూ.1500 డిపాజిట్ చేయాలని.. మూడేళ్ల తర్వాత అవి వినియోగదారుడికే చెల్లిస్తామని ముఖేష్ అంబానీ చెప్పారు.