శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 16 నవంబరు 2016 (10:23 IST)

రూ.1000, రూ.1500కే జియో ఫోన్లు... టచ్ స్క్రీన్ సౌకర్యం మాత్రం లేదు...

దేశంలో రిలయన్స్ జియో ఓ సంచలనం సృష్టించింది. ఫ్రీ వాయిస్ కాల్స్‌తో పాటు.. మూడు నెలల పాటు ఉచిత ఇంటర్నెట్ సేవలను వెల్‌కమ్ ఆఫర్ కింద అందిస్తూ వస్తోంది.ఈ నేపథ్యంలో.. ఈ కంపెనీ మరింతమంది మొబైల్ వినియోగదారులన

దేశంలో రిలయన్స్ జియో ఓ సంచలనం సృష్టించింది. ఫ్రీ వాయిస్ కాల్స్‌తో పాటు.. మూడు నెలల పాటు ఉచిత ఇంటర్నెట్ సేవలను వెల్‌కమ్ ఆఫర్ కింద అందిస్తూ వస్తోంది.ఈ నేపథ్యంలో.. ఈ కంపెనీ మరింతమంది మొబైల్ వినియోగదారులను సొంతం చేసుకునేందుకు వీలుగా అతి తక్కువ ధరకు 4జీ మొబైల్స్‌ను మార్కెట్‌లో తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. 
 
ప్రధానంగా రూరల్, టైర్ 2 కస్టమర్లను దృష్టిలో పెట్టుకుని 4జీ మొబైల్ హ్యాండ్ సెట్లు విడుదల చేయాలని భావిస్తోంది. ఈ ప్రాంతాలకు చెందిన మొబైల్ వినియోగదారుల్లో ఎక్కువ శాతం మంది ఇంకా 2జీపై ఆధారపడడంతో కేవలం 1000, 1500 రూపాయలకే 4జీ హ్యాండ్ సెట్‌ను మార్కెట్‌లోకి తీసుకురావడం ద్వారా తిరుగులేని మార్కెట్ వాటాను సొంతం చేసుకోవచ్చని రిలయన్స్ జియో భావిస్తోంది.
 
దీంతో సరికొత్త మొబైల్ హ్యాండ్ సెట్స్ మార్కెట్‌లోకి తీసుకురావాలన్న ఆలోచనలో రిలయన్స్ జియో వుంది. ఆ ఫోనులో ఎల్టీఈ, వాయిస్ ఓవర్ ఎల్టీఈ టెక్నాలజీతో ఫీచర్లు మాత్రం అందుబాటులో ఉంటాయి. ఇవి స్మార్ట్ ఫోన్ల మాదిరిగానే ఈ డివైజ్‌లు పనిచేస్తాయని, కేవలం టచ్ స్క్రీన్ మాత్రమే ఇందులో ఉండదని పేర్కొంది. అయితే, ఈతరహా ఫోన్లను 2017లో అందుబాటులోకి తెచ్చే వెసులుబాటు ఉంది.