సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 10 జులై 2020 (10:55 IST)

2021 నుంచి చార్జర్ లేని మొబైల్స్ విక్రయం...

ప్రపంచ వ్యాప్తంగా స్మార్ట్ ఫోన్ విప్లవం సాగుతోంది. ఫలితంగా ప్రతి స్మార్ట్ ఫోనుకూ ఓ మొబైల్ ఛార్జర్ తప్పుకుండా ఉంటోంది. అయితే, వచ్చే యేడాది నుంచి చార్జర్ లేని మొబైల్ ఫోన్లు విక్రయించాలని పలు కంపెనీలు ప్లాన్ చేస్తున్నాయి. ముఖ్యంగా, ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీలైన యాపిల్, శాంసంగ్ కంపెనీలు ఈ దశగా అడుగులు వేస్తున్నాయి. 
 
ముందుగా యాపిల్ ఫోన్ల తయారీ కంపెనీ వచ్చే యేడాది నుంచి విక్రయించే ఫోను బాక్సులో మొబైల్ చార్జర్‌తో పాటు.. ఇయర్ పాడ్స్‌ను విక్రయించబోదు. అయితే, మొబైల్ చార్జింగ్ కేబుల్ మాత్రం ఫోనుతో పాటు ఇవ్వనుంది. 
 
ఇకపోతే, సౌత్ కొరియా మొబైల్ దిగ్గజం శాంసంగ్ కూడా ఇదే తరహాలో ప్లాన్ చేస్తోంది. ఎందుకంటే.. దేశంలో అనేక మంది వద్ద మొబైల్ చార్జర్లు ఉన్నాయనీ, అందువల్ల వీటిని బంద్ చేయాలని భావిస్తోంది. తద్వారా మొబైల్ తయారీ ధరను కూడా అదుపు చేయవచ్చని పేర్కొంది.