సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 28 ఏప్రియల్ 2021 (18:19 IST)

శాంసంగ్‌ గెలాక్సీ ఎం42 5జీ రిలీజ్.. మే నెలలో ఆన్‌లైన్ సేవలు

Samsung Galaxy M42 5G
భారతదేశపు అత్యంత విశ్వసనీయమైన స్మార్ట్‌ఫోన్‌ బ్రాండ్‌ శాంసంగ్‌ గెలాక్సీ ఎం42 5జీను ఆవిష్కరించింది. శాంసంగ్‌ యొక్క మొట్టమొదటి మిడ్‌ సెగ్మంట్‌ 5జీ ఉపకరణం ఇది. క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ 750జీ ప్రాసెసర్‌తో శక్తివంతం అయిన గెలాక్సీ ఎం42 5జీ, వాస్తవంగా అత్యంత వేగవంతమైన మానెస్టర్‌గా నిలుస్తుంది. 
 
సాంకేతికత పట్ల అమితాసక్తి కలిగిన మిల్లీనియల్స్‌ మరియు వేగవంతమైన జీవితాలను కోరుకునే జెన్‌ జెడ్‌ వినియోగదారుల కోసం డిజైన్‌ చేయబడింది. గెలాక్సీ ఎం42 5జీ ఇప్పుడు గెలాక్సీ ఎం స్మార్ట్‌ఫోన్‌‌లో మొట్టమొదటి స్మార్ట్‌ఫోన్‌గా శాంసంగ్‌ పేను సైతం కలిగి ఉంది. 
 
శాంసంగ్‌ యొక్క సురక్షితమైన, అత్యంత సులభంగా వినియోగించతగిన మొబైల్‌ చెల్లింపుల సేవ ఇది. గెలాక్సీ ఎం42 5జీ స్మార్ట్‌ఫోన్‌లో శాంసంగ్‌ యొక్క డిఫెన్స్‌ గ్రేడ్‌ మొబైల్‌ సెక్యూరిటీ ప్లాట్‌ఫామ్‌ శాంసంగ్‌ నాక్స్‌ సైతం వస్తుంది. 
 
గెలాక్సీ ఎం42 5జీ స్మార్ట్‌ఫోన్‌ అత్యద్భుతమైన ప్రిజమ్‌ డాట్‌ బ్లాక్‌, ప్రిజమ్‌ డాట్‌ గ్రే కలర్స్‌లో 21999 రూపాయలకు 6జీబీ+128 జీబీ వేరియంట్‌ మరియు 23999 రూపాయలలో 8జీబీ+128జీబీ వేరియంట్‌ లభ్యమవుతుంది. గెలాక్సీ ఎం42 5జీ ఇప్పుడు శాంసంగ్‌ డాట్‌ కామ్‌, అమెజాన్‌, ఎంపిక చేసిన రిటైల్‌ స్టోర్ల వద్ద లభ్యమవుతుంది. 
 
ప్రత్యేక పరిచయ ధరగా వినియోగదారులు గెలాక్సీ ఎం42 5జీని ప్రత్యేక ధర 19,999 రూపాయలలో 6జీబీ వేరియంట్‌ను 21,999 రూపాయలలో 8జీబీ వేరియంట్‌ను శాంసంగ్‌ డాట్‌ కామ్‌ మరియు మే నెలలో అమెజాన్‌ యొక్క ఆన్‌లైన్‌ సేల్‌లో కొనుగోలు చేయవచ్చు.