శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 7 నవంబరు 2016 (15:07 IST)

నిన్న శాంసంగ్ గెలాక్సీ నోట్‌లు.. నేడు శాంసంగ్ వాషింగ్‌మెషీన్లు... పేలిపోతున్నాయ్...

శాంసంగ్ కంపెనీకి చెందిన ఉత్పత్తులు పేలిపోతున్నాయి. ఇప్పటికే ఈ కంపెనీ తయారు చేసిన గెలాక్సీ నోట్లు పేలిపోగా.. తాజాగా వాషింగ్ మెషీన్లు కూడా పేలిపోయాయి.

శాంసంగ్ కంపెనీకి చెందిన ఉత్పత్తులు పేలిపోతున్నాయి. ఇప్పటికే ఈ కంపెనీ తయారు చేసిన గెలాక్సీ నోట్లు పేలిపోగా.. తాజాగా వాషింగ్ మెషీన్లు కూడా పేలిపోయాయి. 
 
ఈ పేలుడు వార్తలపై ఆ కంపెనీ స్పందించింది. ఇటీవల తాము విడుదల చేసిన టాప్‌లోడ్‌ వాషింగ్‌ మెషీన్‌ మోడల్‌ ఒక దానిలో లోపం ఉందని కంపెనీ తెలిపింది. ‘‘ఈ లోపం వల్ల వాషింగ్‌ మెషీన్‌ బ్యాలెన్స్‌ కోల్పోవచ్చు. అతిగా వైబ్రేట్‌ కావచ్చు. కొన్ని అరుదైన కేసుల్లో పేలవచ్చు కూడా!’’ అని వివరించింది. అందువల్ల వీటి వాలంటరీ రీకాల్‌కు పిలుపునిస్తున్నట్లు ప్రకటించింది.
 
కాగా, ఈ కంపెనీ ఇప్పటివరకు 28 లక్షలకు పైగా ఈ తహా వాషింగ్‌ మెషీన్లను విక్రయించినట్లు సమాచారం. ఈ మోడల్‌లో బరువైన దుస్తులు, దుప్పట్ల వంటివి ఉతికేందుకు ఉద్దేశించిన హైస్పీడ్‌ సైకిల్‌ సెట్టింగ్‌ వల్ల వాషింగ్‌ మెషీన్‌లోని డ్రమ్‌ బ్యాలెన్స్‌ కోల్పోయి, మెషీన్‌ విపరీతంగా వైబ్రేట్‌ అయి మెషీన్‌ పై భాగం ఊడి విడిపోతోందని పలు ఫిర్యాదులు అందాయి. వీటిని సరిచేసే పనిలో కంపెనీ ఇంజనీర్లు ఉన్నాయి.