గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 12 జులై 2023 (11:48 IST)

టాటా గ్రూప్ అరుదైన రికార్డు.. దేశంలో ఐఫోన్ ఉత్పత్తి చేసిన..?

TATA Group
టాటా గ్రూప్ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకుంది. టాటా గ్రూప్ త్వరలో యాపిల్ ఐఫోన్‌లను తొలిసారిగా భారత్‌లో ఉత్పత్తి చేయనుంది. తైవాన్‌కు చెందిన విస్ట్రాన్ కంపెనీ ఐఫోన్‌ల తయారీకి కర్ణాటకలో ఫ్యాక్టరీని ఏర్పాటు చేసింది. ఆపిల్ నుండి తాజా ఐఫోన్ 14 మోడల్‌ను విస్టార్ తయారు చేసింది.
 
10,000 మందికి పైగా కార్మికులు పనిచేస్తున్న ఈ కర్మాగారాన్ని టాటా రూ.5,000 కోట్లకు కొనుగోలు చేసింది. ఇందుకోసం ఏడాది కాలంగా చర్చలు జరుగుతుండగా.. వచ్చే నెలలో ఐఫోన్ ఫ్యాక్టరీని టేకోవర్ చేసేందుకు ఒప్పందం కుదిరినట్లు సమాచారం. 
 
దీన్ని తయారు చేసిన తొలి భారతీయ కంపెనీగా టాటా గ్రూప్‌కు గౌరవం దక్కనుంది. మార్చి 2024 వరకు తన ఫ్యాక్టరీ నుండి దాదాపు రూ. 15,000 కోట్ల విలువైన ఐఫోన్‌లను తయారు చేయడానికి విస్ట్రాన్ ఇప్పటికే ఒప్పందంపై సంతకం చేసింది.