బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By Selvi
Last Updated : సోమవారం, 7 నవంబరు 2016 (15:04 IST)

రిలయన్స్ 4జీ క్రేజ్‌: జోరందుకున్న స్మార్ట్ ఫోన్ల వ్యాపారం..

రిలయన్స్ 4జీ క్రేజ్‌తో స్మార్ట్ ఫోన్ల వ్యాపారం జోరందుకుంది. స్మార్ట్ ఫోన్ కంపెనీల మధ్య పోటాపోటీలు నెలకొనడంతో అంతర్జాతీయ బ్రాండ్‌లు మొదలుకుని దేశవాళీ బ్రాండ్‌ల వరకు బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌లను

రిలయన్స్ 4జీ క్రేజ్‌తో స్మార్ట్ ఫోన్ల వ్యాపారం జోరందుకుంది. స్మార్ట్ ఫోన్ కంపెనీల మధ్య పోటాపోటీలు నెలకొనడంతో అంతర్జాతీయ బ్రాండ్‌లు మొదలుకుని దేశవాళీ బ్రాండ్‌ల వరకు బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌లను సదరు సంస్థలు భారత మార్కెట్లోకి రిలీజ్ చేస్తున్నాయి. రూ.7,000 నుంచి రూ.12,000లోపు ధరల్లో మార్కెట్లో 15 బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్ ఫోన్లలో సామ్‌సంగ్ గెలాక్సీ జే2 (2016) రూ.9.700కే లభిస్తోంది. 
 
అలా లెనోవో వైబ్ కె5 ప్లస్ (ధర రూ.8,499)లకు, జియోమీ రెడ్మీ నోట్ 3 (ధర రూ.9,499)లకు, మోటో ఇ3 పవర్ (ధర రూ.7,999)లకు లభిస్తోంది. ఇదే తరహాలో ఒప్పో ఏ37.. రూ.10,789లకు అమ్ముడు పోతోంది. ఇదేవిధంగా సామ్‌సంగ్ గెలాక్సీ ఆన్5 ప్రో రూ.7,990 లభిస్తోంది. లైఫ్ వాటర్ 9 రూ.12వేలకు, మిజు ఎం3ఎస్.. రూ.9,145లకు లభిస్తోంది. ఇలా పలు కంపెనీలకు చెందిన స్మార్ట్ ఫోన్లకు మంచి గిరాకీ పెరిగింది.