మా డేటా ఆఫర్లు పూర్తిగా చట్టబద్ధమన్న రిలయన్స్ జియో- ''6'' అంకెతో మొబైల్ నెంబర్

ట్రాయ్ టారిఫ్ నియమ నిబంధనలు, మార్గదర్శకాలను రిలయన్స్ జియో ఉల్లంఘిస్తోందని ప్రముఖ టెలికాం దిగ్గజం వొడాఫోన్ ఢిల్లీ హైకోర్టులో పిటీషన్ వేసింది. టారిఫ్ నిబంధనలను అతిక్రమిస్తున్న జియోను నియంత్రించడంలో ట్రా

reliance jio
Selvi| Last Updated: గురువారం, 16 ఫిబ్రవరి 2017 (17:03 IST)
ట్రాయ్ టారిఫ్ నియమ నిబంధనలు, మార్గదర్శకాలను రిలయన్స్ జియో ఉల్లంఘిస్తోందని ప్రముఖ టెలికాం దిగ్గజం వొడాఫోన్ ఢిల్లీ హైకోర్టులో పిటీషన్ వేసింది. టారిఫ్ నిబంధనలను అతిక్రమిస్తున్న జియోను నియంత్రించడంలో ట్రాయ్ విఫలమైందని వొడాఫోన్ తన పిటిషన్‌లో పేర్కొంది. దీనిపై జియో వివరణ ఇచ్చింది. తమ వినియోగదారులకు ఉచితంగా అందిస్తున్న డేటా ఆఫర్లు పూర్తిగా చట్టబద్దమైనవని రిలయన్స్ జియో ఢిల్లీ హైకోర్టుకు విన్నవించింది.

ఈ మేరకు భారత టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ తమకు పూర్తి స్పష్టత నిచ్చిందని వెల్లడించింది. దీనిపై గురువారం విచారణ చేపట్టని కోర్టు.. 21న దీనిపై వాదనలు వింటామని ధర్మాసనం పేర్కొంది. కాగా ఇదే అంశంపై టెలికాం ప్రత్యేక న్యాయస్థానం టీడీఎస్ఏటీ ఈ నెల 20న విచారిస్తుందని ఢిల్లీ హైకోర్టు పేర్కొంది.

ఇదిలా ఉంటే..
ఉచిత డేటా ఆఫర్స్‌తో మార్కెట్‌లో చెరగని ముద్ర వేసుకున్న రిలయన్స్‌ జియో మరో సంచలనానికి తెరతీస్తోంది. '6'అంకెతో ప్రారంభమయ్యే మొబైల్‌ నెంబర్‌ను జారీ చేసే తొలి మొబైల్‌ నెట్‌వర్క్‌గా అవతరించనుంది. ఇప్పటి వరకు మిగిలిన టెలికాం సంస్థలు 9, 8, 7 సిరీస్‌తో మొదలయ్యే ఫోన్‌ నెంబర్‌నే ఇస్తుండగా.. రిలయన్స్‌ జియో తొలిసారిగా '6' అంకెతో ప్రారంభమయ్యే మొబైల్‌ నెంబర్లను యూజర్లకు అందజేయనుంది. ఈ మేరకు డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ టెలికాం (డాట్‌) నుంచి అనుమతులు పొందినట్లు సమాచారం.దీనిపై మరింత చదవండి :