ఆదివారం, 28 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 4 ఆగస్టు 2020 (10:24 IST)

వాట్సాప్ నుంచి ఇక పేమెంట్స్.. ఫోన్‌పే, గూగుల్‌పే, పేటీఎంలకు చెక్?!

వాట్సాప్ యాప్ కొత్త సేవలను ప్రారంభించేందుకు సన్నద్ధమవుతోంది. ఇప్పటికే మెసేజ్‌, వాయిస్ కాల్స్, వీడియో కాల్స్‌తో అందరినీ ఆకట్టుకున్న వాట్సాప్.. యూజర్లకు మరో శుభవార్త చెప్పింది. ఈ యాప్ ద్వారా.. ఇకపై ఇతరులకు డబ్బులు కూడా పంపించవచ్చు. అంటే ఫోన్‌పే, గూగుల్ పే, పేటీఎం లాగా కూడా వాట్సాప్‌ను వాడేయొచ్చు.
 
వాట్సాప్‌ ద్వారా డబ్బులు ఈజీగా పంపించవచ్చు. ఈ సేవలను దేశవ్యాప్తంగా త్వరలోనే అందుబాటులోకి తేనున్నట్టు ప్రకటించింది. అంతేకాదు ఆర్బీఐ డేటా లోకలైజేషన్ పేమెంట్స్ నిబంధనలను అనుగుణంగా ఈ సర్వీసులు ఉంటాయని.. దీనికి ఎన్‌పీసీఐ కూడా సుముఖంగా ఉందని పేర్కొంది.
 
పేమెంట్ సర్వీసులను అందించడానికి.. అది కూడా ఆర్‌బీఐ నిబంధనలకు అనుగుణంగా ఉండేలా చూసేందుకు ఏడాది కాలంగా తమ టీమ్ కృషి చేస్తోందని వాట్సాప్ తెలిపింది. తర్వలోనే అందరికీ పేమెంట్ సర్వీసులు అందుబాటులోకి వస్తాయని తెలిపింది.