శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 23 జనవరి 2017 (12:03 IST)

గెలాక్సీ నోట్‌ 7 పేలిపోవడానికి కారణమిదే..?

గెలాక్సీ నోట్ 7 పేలిపోవడానికి కారణమేంటో శామ్‌సంగ్ వెల్లడించింది. బ్యాటరీ లోపం వల్లే గెలాక్సీ పేలిపోతున్నట్టు వార్తలు వచ్చాయి. దీంతో శామ్‌సంగ్ భారీ నష్టాలను మూటగట్టుకుంది. అంతేకాకుండా, 2016 సెప్టెంబరుల

గెలాక్సీ నోట్ 7 పేలిపోవడానికి కారణమేంటో శామ్‌సంగ్ వెల్లడించింది. బ్యాటరీ లోపం వల్లే గెలాక్సీ పేలిపోతున్నట్టు వార్తలు వచ్చాయి. దీంతో శామ్‌సంగ్ భారీ నష్టాలను మూటగట్టుకుంది. అంతేకాకుండా, 2016 సెప్టెంబరులో కంపెనీ 2.5 మిలియన్ల గెలాక్సీ నోట్‌ 7 ఫోన్లను సామ్‌సంగ్‌ వెనక్కి పిలిచింది. పలుచోట్ల ఫోన్లు పేలిన ఘటనలు చోటుచేసుకోవడంతో కంపెనీ వాటన్నింటిని వెనక్కి పిలిచింది. నోట్‌ 7 ఫోన్లలోని బ్యాటరీలో లోపం వల్లే అవి పేలినట్లు కంపెనీ అంతర్గత, స్వతంత్ర విచారణలో నిర్ధారణ అయిందని సామ్‌సంగ్‌ ఓ ప్రకటన ద్వారా తెలిపింది.
 
వినియోగదారులకు కలిగిన అసౌకర్యానికి మనస్ఫూర్తిగా క్షమాపణలు చెప్తున్నామని సామ్‌సంగ్‌ మొబైల్‌ బిజినెస్‌ అధిపతి కోహ్‌ డాంగ్‌-జిన్‌ తెలిపారు. బ్యాటరీ డిజైన్‌, తయారీలో జరిగిన లోపానికి తాము బాధ్యత వహిస్తున్నామని, దాన్ని గుర్తించి సరిచేసుకుంటామని చెప్పారు. ఇలాంటివి మళ్లీ జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు. సుమారు 700 మంది పరిశోధకులు, ఇంజనీర్లు కలిసి నోట్‌ 7 వైఫల్యంపై విచారణ జరిపినట్లు చెప్పారు. ఇందుకు పూర్తిగా అసెంబుల్‌ చేసిన 2 లక్షల డివైజెస్‌ను, 30 వేల బ్యాటరీలను పరిశీలించారని తెలిపారు.