అందరివీ బిజీ జీవితాలే... కానీ కావాలి ఆనందకరమైన శృంగార జీవితం... ఎలా?

బిజీ జీవితం. ఎన్ని గంటలు చేసినా తరగని పని. ఇంటికొచ్చేసరికి అలసిపోవడం, ఆ తర్వాత శృంగార జీవితం జీరోలా మారిపోతుంది. కానీ ఇలాంటి షెడ్యూల్ తో సాగే జీవితాన్ని గాడిలో పెట్టుకోక తప్పదు. అందుకు కొన్ని చిట్కాలు పాటిస్తే సరి.

మంగళవారం, 21 మార్చి 2017 (21:38 IST)
బిజీ జీవితం. ఎన్ని గంటలు చేసినా తరగని పని. ఇంటికొచ్చేసరికి అలసిపోవడం, ఆ తర్వాత శృంగార జీవితం జీరోలా మారిపోతుంది. కానీ ఇలాంటి షెడ్యూల్ తో సాగే జీవితాన్ని గాడిలో పెట్టుకోక తప్పదు. అందుకు కొన్ని చిట్కాలు పాటిస్తే సరి.
 
ఎన్ని పనులున్నప్పటికీ రోజుకు కనీసం ఆరు గంటల పాటు నిద్రపోవాలి. ప్రతి రోజూ ఓ గంట పాటు వ్యాయామం చేయాలి. వాకింగ్‌, స్విమ్మింగ్‌, షటిల్‌ వంటి వ్యాయామాలు మంచివి. మొక్కుబడిగా కాకుండా ఇష్టంగా చేయాలి. ధ్యానం కూడా లైంగిక శక్తిని పెంచుతుంది. 
 
మారిన జీవన శైలికి అనువుగా వైద్య నిపుణులు దానిమ్మపండ్లు, ఆక్రూట్‌, ఓట్స్‌ శక్తినిస్తాయని చెబుతున్నారు. అలాగే మసాలాలు, ఘాటుగా ఉన్న ఆహారం తీసుకుంటే కూడా కోరిక కలుగుతుంది. కొన్ని రకాలైన చాక్లెట్లు తినడం వల్ల కూడా లైంగిక శక్తి పెరుగుతుందని ఇటీవల పరిశోధనలో తేలింది. 
 
సన్నిహిత మిత్రులతో ఉల్లాసంగా గడపాలి. ఒకప్పటి ఉమ్మడి కుటుంబాలు ఇప్పుడు లేకపోవడంతో ఒంటరితనం పెరుగుతోంది. అందుకే వారానికి ఓ సారైనా పార్కులకు, రెస్టారెంట్‌లకు వెళ్లి మిత్రులతో కలిసి మెలిసి ఉల్లాసంగా ఉండేలా చూసుకోవాలి. భార్యాభర్తల మధ్య లేనిపోని అనుమానాలకు తావులేకుండా చూసుకోవాలి. అనుమానాల వల్ల మానసిక ఆందోళనకు గురై లైంగిక ఆసక్తి తగ్గుతుంది. మనసు విప్పి మాట్లాడుకో వడం వల్ల జీవితం సుఖమయమవుతుంది.

అన్నీ చూడండి

కరీంనగర్‌లో భారీ దోపిడీ.. 66 తులాల బంగారం, 10 తులాల వెండి, 21లక్షలు ఎత్తుకెళ్లారు..

ఆస్ట్రేలియా బాండీ బీచ్‌ కాల్పుల ఘటన హీరోకు సిడ్నీలో శాశ్వత నివాసం

ఏపీలో కొత్తగా ఏడు కోవిడ్ కేసులు.. 26కి చేరిన యాక్టివ్ కేసుల సంఖ్య

ఇందిరమ్మ గృహాలకు ఆధార్ లింక్ తప్పనిసరి : తెలంగాణ సర్కార్ ఆదేశం

భార్య, పిల్లల నోటికి ప్లాస్టర్ అంటించి గొంతునులిమి హత్య చేసిన భర్త.. ఆపై తాను కూడా..

అన్నీ చూడండి

Kajal Aggarwal: విడుదలకు ముందే చర్చకు తావిస్తున్న ది ఇండియా స్టోరీ

ఆ పోస్ట్‌ను తప్పుగా అర్థం చేసుకున్నారు.. ఆరోగ్యంగానే ఉన్నాను : అమితాబ్

జియోస్టార్, భారతదేశ వ్యాప్తంగా ఆరు బిగ్ బాస్ ఎడిషన్లు ఒకేచోట

Prabhas: స్పిరిట్ పంపిణీ కోసం పీపుల్ మీడియా, ఏషియన్ సురేష్ భాగస్వామ్యం

Priyadarshi: ఈ కథ విన్నప్పుడు మా అమ్మ గుర్తొచ్చింది : ప్రియదర్శి

తర్వాతి కథనం