శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , సోమవారం, 24 ఏప్రియల్ 2017 (08:24 IST)

హ్యాపీ బర్త్‌డే ఇండియా, ప్రమ్ ఇండియా: జాంటీరోడ్స్ కుమార్తెకు మోదీ జన్మదిన శుభాకాంక్షలు

దక్షిణాఫ్రికా క్రికెటర్ జాంటీ రోడ్స్ కుమార్తె ఇండియా రెండో పుట్టిన రోజు సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ ఇండియా నుంచి జన్మశుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన పంపిన హ్యాపీ బర్త్‌డే ఇండియా, ప్రమ్ ఇండియా అనే సందేశం చాలామందికి ఆసక్తి కలిగించింది. దక్షిణా

దక్షిణాఫ్రికా క్రికెటర్ జాంటీ రోడ్స్ కుమార్తె ఇండియా రెండో పుట్టిన రోజు సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ ఇండియా నుంచి జన్మశుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన పంపిన హ్యాపీ బర్త్‌డే ఇండియా, ప్రమ్ ఇండియా అనే సందేశం చాలామందికి ఆసక్తి కలిగించింది. దక్షిణాఫ్రికా అద్బుత క్రికెటర్ జాంటీ రోడ్స్‌కి 2015 ఏప్రిల్‌లో ఒక కుమార్తె పుట్టింది. ఆశ్చర్యమేమిటంటే ఆమెకు అతడు ఇండియా అని పేరు పెట్టాడు.  భారతదేశం పట్ల తన ప్రేమను వ్యక్తీకరించేందుకు, భారత సుసంపన్న మిశ్రమ సంస్కృతి, వారసత్వం, సంప్రదాయాలను గౌరవించేందుకు తన కూతురికి ఇండియా అని పేరు పెట్టినట్లు రో్డ్స్ తెలిపాడు.
 
భారత్ గొప్ప ఆధ్యాత్మిక దేశం. ముందు చూపు ఉన్న దేశం. ఈ రెండింటి సమ్మేళనం నాకు చాలా ఇష్టం. జీవితంలో మీరు సమతుల్యత కలిగి ఉండాలి. ఇండియా ఆనే పేరు పెట్టాము కనుక మా కుమార్తె రెండు ప్రపంచాలలోని ఉత్తమమైన దాన్ని పొంది జీవితంలో సమతుల్యత సాధించగలదని ఆశిస్తున్నాను అని చెప్పాడు జాంటీ రోడ్స్.
 
క్రికెట్ మైదానంలో ఫీల్డింగులో జాంటీ రోడ్స్ చేసిన ఏరోబిక్ విన్యాసాలు క్రికెట్ ప్రపంచాన్ని నివ్వెరపరచాయి. తన కుమార్తెకు ఇండియా అని పేరు పెట్టుకున్న వైనం  ప్రదాని నరేంద్రమోదీకి ఎలా తెలిసిందో కానీ హ్యాపీ బర్త్‌డే ఇండియా, ప్రమ్ ఇండియా అంటూ ఆదివారం ఆ చిన్నారికి సందేశం పంపారు.