శనివారం, 25 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : శుక్రవారం, 27 ఏప్రియల్ 2018 (18:01 IST)

మదర్సాలోకి లాక్కెళ్లి బాలికపై గ్యాంగ్ రేప్.. చాపలో చుట్టేసి...?

దేశంలో మహిళలపై అఘాయిత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. ఉన్నావో, కథువా ఘటనలకు మరువక ముందే యూపీలో సభ్యసమాజం తలదించుకునే ఘటన చోటుచేసుకుంది. యూపీలోని ఘజియాబాద్‌లో పదేళ్ల బాలికను మదర్సాలోకి లాక్కెళ్లి ఈ నెల 21వ

దేశంలో మహిళలపై అఘాయిత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. ఉన్నావో, కథువా ఘటనలకు మరువక ముందే యూపీలో సభ్యసమాజం తలదించుకునే ఘటన చోటుచేసుకుంది. యూపీలోని ఘజియాబాద్‌లో పదేళ్ల బాలికను మదర్సాలోకి లాక్కెళ్లి ఈ నెల 21వ తేదీన అత్యాచారానికి పాల్పడ్డారు. వివరాల్లోకి వెళితే.. బాధితురాలు ఏదో వస్తువు కొనేందుకు షాపుకు వెళ్లగా ఆమె ఆచూకీ తెలియరాలేదు. దీంతో జడుసుకున్న బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 
 
బాలిక వద్ద వున్న ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి వుండటంతో లొకేషన్‌ను పసిగట్టిన పోలీసులు రంగంలోకి దిగారు. లొకేషన్‌ మదర్సాను చూపెట్టడంతో 22వ తేదీన పోలీసులు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టారు. అక్కడ బాలికను ఓ చాపలో చుట్టి ఉంచారు. పోలీసులు దాడి చేసిన సమయంలో ఒక టీనేజ్ యువకుడితో పాటు, మౌల్వి, మరో ఇద్దరు అక్కడే ఉన్నారు. ఈ ఘటనలో ఇద్దరు ముగ్గురుని పోలీసులు అరెస్ట్ చేశారు. 
 
బాధితురాలి వాంగ్మూలంలో టీనేజర్ తన సోదరుని వద్దకు తీసుకెళ్తానని చెప్పాడని.. అతని వెంటనే వెళ్లాక మౌల్వితో పాటు మరో టీనేజర్‌ కూడా అత్యాచారానికి పాల్పడ్డారని తెలిసింది. ఈ కేసులో కీలక నిందితుడైన 17 ఏళ్ల టీనేజర్‌ను పోలీసులు అరెస్ట్ చేసి, జువైనల్ హోమ్‌కు తరలించారు. 
 
అయితే మౌల్వీని కూడా అరెస్ట్ చేయాలంటూ బాధితురాలి కుటుంబీకులు డిమాండ్ చేస్తున్నారు. మౌల్వీని అరెస్ట్ చేయాలంటూ హిందుత్వ సంఘాల ప్రతినిధులు కూడా డిమాండ్ చేస్తున్నారు. నిందితులకు తగిన శిక్ష పడాలని బాధితురాలి కుటుంబీకులు డిమాండ్ చేస్తున్నారు.