బుధవారం, 27 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 27 ఏప్రియల్ 2018 (16:16 IST)

ప్రభుత్వ ఉద్యోగం కోసం కన్నతండ్రిని చంపేశాడు...

ప్రభుత్వ ఉద్యోగం కోసం కన్నతండ్రిని చంపాడో కసాయి బిడ్డ. ఈ దారుణం బీహార్ రాష్ట్రంలోని పాట్నాలో జరిగింది. ఈ దారుణం బీహార్ రాష్ట్రంలోని ముంగర్ జిల్లాలోని ఈస్ట్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం ఉదయం చ

ప్రభుత్వ ఉద్యోగం కోసం కన్నతండ్రిని చంపాడో కసాయి బిడ్డ. ఈ దారుణం బీహార్ రాష్ట్రంలోని పాట్నాలో జరిగింది. ఈ దారుణం బీహార్ రాష్ట్రంలోని ముంగర్ జిల్లాలోని ఈస్ట్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం ఉదయం చోటుచేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ వివరాలను పరిశీలిస్తే...
 
ఓం ప్రకాశ్ మండల్ అనే వ్యక్తి రైల్వేలో ఉద్యోగి. ఆయన కుమారుడు పవన్ (28).. నిరుద్యోగి. ఉపాధి కోసం తిరగని ఆఫీసంటూ లేదు. గత కొన్నేళ్లుగా ఉద్యోగ సంపాదనలో నిమగ్నమయ్యాడు. అలాగే, ప్రభుత్వ ఉద్యోగానికి ప్రిపేర్ అవుతున్నాడు. అయితే పవన్‌కు ఉద్యోగం రావడం లేదు. 
 
ఈ నేపథ్యంలో తన తండ్రి ఏప్రిల్ 30న పదవీ విరమణ పొందనున్నారు. ఇక ఎలాగైనా తన తండ్రిని హత్య చేయించి.. కారుణ్య నియామకం కింద ఉద్యోగం పొందాలని పవన్ పక్కా ప్లాన్ వేశాడు. దీంతో ఇద్దరు కిరాయి వ్యక్తులతో రూ.2 లక్షలకు డీల్ కుదుర్చుకున్నాడు. ముందస్తుగా రూ.లక్ష ఇచ్చాడు. పథకం ప్రకారం తండ్రి ఓం ప్రకాశ్‌ను హత్య చేశారు. 
 
దీనిపై కేసు నమోదు చేసిన బీహార్ పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ చేపట్టారు. ఈ విచారణలో భాగంగా ప్రకాశ్ ఈనెల 30వ తేదీన పదవీ విరమణ కాబోతున్నారనే విషయం తెలుసుకున్నారు. దీంతో అతని కుమారుడిపై సందేహించి అదుపులోకి తీసుకుని విచారించగా, అసలు నిజం బయటపడింది. దీంతో ఈ కేసులో పవన్‌తో పాటు కిరాయి వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.