1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By JSK
Last Updated : శుక్రవారం, 5 ఆగస్టు 2016 (20:31 IST)

గాంధీజీని 'జాతిపిత' అని ప్రకటించలేద‌ట‌, మరి ఈ బిరుదు ఎవరిచ్చారు...?

మ‌న‌కు స్వ‌రాజ్యాన్ని తెచ్చిన గాంధీజీని జాతిపితగా ప్రభుత్వం ఎప్పుడూ అధికారకరంగా ప్రకటించలేద‌ట‌. ఈ మేరకు కేంద్ర హోంశాఖ సమాచార హక్కు( సహ ) చట్టం కింద దాఖలైన దరఖాస్తుకు సమాచారం ఇచ్చింది. మహాత్మ గాంధీని జ

మ‌న‌కు స్వ‌రాజ్యాన్ని తెచ్చిన గాంధీజీని జాతిపితగా ప్రభుత్వం ఎప్పుడూ అధికారకరంగా ప్రకటించలేద‌ట‌. ఈ మేరకు కేంద్ర హోంశాఖ సమాచార హక్కు( సహ ) చట్టం కింద దాఖలైన దరఖాస్తుకు సమాచారం ఇచ్చింది. మహాత్మ గాంధీని జాతిపితగా పిలుస్తున్నా అలాంటి బిరుదు ఆయనకు ఎప్పుడు లాంఛనంగా ఇవ్వలేద‌ని కేంద్ర ప్రజా సమాచార అధికారి శ్యామల మోహన్ తెలిపారు. 
 
మే 21న అభిషేక్ కడ్యన్ అనే సామాజికవేత్త జాతిపితకు సంబంధించిన వివరాలు కోరుతూ, సమాచార చట్టం క్రింద దరఖాస్తు చేశారు. దీనికి హోం శాఖ కాస్త ఆల‌స్యంగా ఈ సమాధానం ఇచ్చింది. అంతకుముందు 2012లో లక్నోకి చెందిన ఆరవ తరగతి చదువుతున్న ఐశ్వర్య అనే పాప "జాతిపిత"  ప్రకటన ఫోటో కాపీ కో‌రుతూ, సమాచార చట్టం కింద ప్రధానమంత్రి కార్యాలయాన్నిఫిబ్రవరిలో కోరింది. 
 
అలాంటి పత్రాలు తమ వద్దలేవని కార్యాల‌యం పేర్కొంది. ఆ ద‌రఖాస్తూను నేషనల్ ఆర్కైవ్స్ ఆఫ్ ఇండియాకు పంపారు. అక్కడ కూడా ఆ పత్రం లభించలేదు. గాంధీజీకి మహాత్మ అన్న బిరుదు అధికారికంగా ఇచ్చారా అంటే వాస్తవాలలోకి వెళితే ఇవ్వలేదనే చెప్పాలంటున్నారు విశ్లేష‌కులు.
 
ఐతే గాంధీజీకి జాతిపిత అనే బిరుదును నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇచ్చినట్లు చరిత్రలో కనబడుతుంది. జూలై 6, 1944లో సింగపూర్ రేడియోతో మాట్లాడుతూ గాంధీజీ జాతిపిత అని అన్నారు. ఆ తర్వాత ఏప్రిల్ 28, 1947లో జరిగిన సమావేశంలో గాంధీజీని జాతిపిత అని సరోజినీ నాయుడు సంబోధించారు. ఇక అంతకుమించిన ఆధారాలు ఎక్కడ ఉంటాయి...?