సోమవారం, 28 ఏప్రియల్ 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శనివారం, 15 అక్టోబరు 2016 (15:27 IST)

వారణాసిలో తొక్కిసలాట.. 12 మంది మృత్యువాత

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రాతినిథ్యం వహిస్తున్న లోక్‌సభ నియోజకవర్గమైన వారణాసిలో విషాదం చోటుచేసుకుంది. నగరంలోని రాజ్‌ఘాట్ వంతెనపై తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 12మంది చనిపోయారు. మరో 22 మంది గాయపడ్డారు

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రాతినిథ్యం వహిస్తున్న లోక్‌సభ నియోజకవర్గమైన వారణాసిలో విషాదం చోటుచేసుకుంది. నగరంలోని రాజ్‌ఘాట్ వంతెనపై తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 12మంది చనిపోయారు. మరో 22 మంది గాయపడ్డారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు.
 
కాగా బాబా జై గురుదేవ్ సభ వేడుకలను తిలకించేందుకు భారీగా భక్తులు తరలివచ్చారు. వీరంతా రాజ్‌ఘాట్ వంతెన వద్దకు చేరుకున్నారు. ఆ సమయంలో బాబా జై గురుదేవ్‌ను చూసేందుకు ఒక్కసారి ఎగబడటంతో ఈ తొక్కిసలాట జరిగింది. విషయం తెలుసుకున్న వెంటనే సీనియర్ అధికారులు అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.