1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 27 ఆగస్టు 2022 (20:31 IST)

బంగ్లాదేశ్ సరిహద్దు వద్ద మహిళపై అత్యాచారం..

rape
బంగ్లాదేశ్ సరిహద్దు సమీపంలో ఒక మహిళపై అత్యాచారానికి పాల్పడిన ఇద్దరు సరిహద్దు భద్రతా దళ సిబ్బందిని అరెస్ట్ చేసినట్లు పారామిలటరీ ఆర్గనైజేషన్ సీనియర్ అధికారి ఒకరు శనివారం నాడు తెలిపారు. అరెస్టయిన వారిలో బీఎస్ఎఫ్ అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్, ఒక కానిస్టేబుల్ ఉన్నారు. నిందితులిద్దరినీ తదుపరి చట్టపరమైన చర్యల కోసం పశ్చిమబెంగాల్ పోలీసులకు అప్పగించారు.
 
పశ్చిమ బెంగాల్‌లోని 24 పరగణాల జిల్లాలోని బగ్డా బోర్డర్ ఔట్ పోస్ట్ వచ్చిన ఈనెల 26న ఈ ఘటన జరిగినట్టు చెప్పారు. ''ఇండియా నుంచి బంగ్లాదేశ్‌లోకి అక్రమంగా ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్న ఒక మహిళను బీఎస్ఎఫ్ కానిస్టేబుల్ అడ్డుకున్నాడు. ఆ వెంటనే సమీపంలోని పొలాల వైపు లాక్కెళ్లి ఆమెపై అత్యాచారం చేశాడు. ఇందుకు ఏఎస్ఐ సహకరించాడు'' అని ఆ అధికారి వివరించారు. సదరు మహిళ ఫిర్యాదుతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
 
కాగా, ఈ ఘటనపై అటు టీఎంసీ, ఇటు బీజేపీకి మధ్య మాటల యుద్ధం చోటుచేసుకుంది. అంతర్జాతీయ సరిహద్దు నుంచి బీఎస్‌ఎఫ్ పరిధిని 15 కిలోమీటర్ల పరిధి నుంచి 50 కిలోమీటర్ల వరకూ విస్తరిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని మొదట్నించీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వ్యతిరేకిస్తున్నారు. తాజా ఘటనపై టీఎంసీ ఓ ట్వీట్‌లో కేంద్రంపై విమర్శలు గుప్పించింది.