బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 5 ఏప్రియల్ 2024 (09:05 IST)

కర్ణాటకలో 211 స్వతంత్ర్య అభ్యర్థుల నామినేషన్లు

karnataka election
కర్ణాటకలోని 14 లోక్‌సభ స్థానాలకు 211 మంది స్వతంత్రులతో సహా మొత్తం 358 మంది అభ్యర్థులు గురువారం నామినేషన్లు దాఖలు చేశారు. రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన వివరాల ప్రకారం 358 మంది పోటీదారులలో 333 మంది పురుషులు, 25 మంది మహిళలు ఉన్నారు.గురువారం (ఏప్రిల్ 4) నామినేషన్ దాఖలుకు చివరి తేదీ.
 
 నామినేషన్ పత్రాల సమర్పణ చివరి రోజు (గురువారం) మొత్తం 183 మంది అభ్యర్థులు (171 మంది పురుషులు, 12 మంది మహిళలు) తమ నామినేషన్లను దాఖలు చేశారు.
 
అత్యధికంగా బెంగళూరు దక్షిణ లోక్‌సభ స్థానానికి (49), చిక్కబళ్లాపుర (43), బెంగళూరు సెంట్రల్‌ (40) స్థానాలకు నామినేషన్లు దాఖలయ్యాయి. మొత్తంగా బీజేపీ నుంచి 41 మంది, కాంగ్రెస్ నుంచి 50 మంది, బీఎస్పీ నుంచి 18 మంది, జేడీఎస్ నుంచి 10 మంది, సీపీఎం నుంచి ఒకరు నామినేషన్లు దాఖలు చేశారు. అదనంగా 211 మంది స్వతంత్ర అభ్యర్థులు కూడా తమ నామినేషన్లు దాఖలు చేశారు.
 
ఈసీ ఇప్పటి వరకు రూ.30.19 కోట్ల నగదు, రూ.131.92 విలువ చేసే మద్యం, రూ.3.13 కోట్ల విలువైన డ్రగ్స్, రూ.187.85 కోట్ల విలువైన బంగారం, వజ్రాలు సహా విలువైన లోహాలను స్వాధీనం చేసుకుంది.
 
ఫ్లయింగ్ స్క్వాడ్‌లు, ఎస్‌ఎస్‌టీలు, పోలీసు అధికారులు నగదు, మద్యం, మాదకద్రవ్యాలు, విలువైన లోహాలు మరియు ఉచిత వస్తువులను స్వాధీనం చేసుకోవడంపై 1,240 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు. అలాగే 790 రకాల వాహనాలను సీజ్ చేశారు.