1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 25 జనవరి 2020 (08:32 IST)

కేజ్రీవాల్‌పై 27మంది ప్రత్యర్థులు

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పోటీ చేస్తున్న న్యూఢిల్లీ సీటుపై అందరి దృష్టి పడింది. కేజ్రీవాల్ తన నామినేషన్ దాఖలు చేయగానే, అతనిపై పోటీ చేసేందుకు 88 మంది ఎన్నికల బరిలోకి దూకారు.

వీరిలో సన్యాసులు మొదలుకొని డ్రైవర్, కండక్టర్ల వరకూ ఉన్నారు. కేజ్రీవాల్‌పై పోటీ చేసేందుకు సిద్ధమైన 88 అభ్యర్థుల నామినేషన్ పత్రాల స్క్రూటినీ అనంతరం 34 మంది పోటీకి అర్హులుగా తేలారు. వివిధ కారణాలతో 54 మంది అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి.

కాగా చివరకు ఫైనల్ జాబితా ప్రకారం న్యూఢిల్లీ సీటు నుంచి 28 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. కాగా కేజ్రీవాల్‌పై పోటీ చేస్తున్న వారిలో కొంతమంది విచిత్రమైన పార్టీల నుంచి బరిలోకి దిగారు. ‘ఆమ్ ఆద్మీ పార్టీ’ని పోలిన మరో ‘ఆప్’ పార్టీ పోటీకి సిద్ధమయ్యింది. అయితే ఇక్కడ ‘ఆప్’ అంటే ‘అన్‌జాన్ ఆద్మీ పార్టీ‘ అని అర్థం. ఈ పార్టీ నుంచి శైలేంద్ర సింగ్ పోటీ చేస్తున్నారు.

అలాగే భారతీయ ‘లోక్‌తాంత్రిక్ పార్టీ’, ‘హిందుస్తానీ అవామ్ మోర్చా’, ‘పీపుల్స్ పార్టీ ఆఫ్ ఇండియా’, ‘విజయ్ భారత్ పార్టీ’, ‘భారతీయ సామాజిక న్యాయ్ పార్టీ’, ‘రైట్ టూ రీకాల్ పార్టీ’, ‘బహుజన్ ద్రవిడ్ పార్టీ’, ‘జన్ ఆవాజ్ వికాస్ పార్టీ’, ‘విశ్వ శక్తి పార్టీ’, ‘అహీర్ నేషనల్ పార్టీ’, ‘రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా’, ‘రాష్ట్రీయ రాష్ట్రవాదీ పార్టీ’, ‘జనాధాన్ నేషనల్ పార్టీ’, రాష్ట్రీయ జనసంభావనా పార్టీ’, ‘యువ కాంత్రికారీ పార్టీ’, ‘మజ్దూర్ ఏక్తా పార్టీ’ ఇలా పలు పార్టీలు ఢిల్లీ ఎన్నికల్లో బరిలోకి దిగాయి.