మంగళవారం, 7 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 9 డిశెంబరు 2022 (11:40 IST)

పెళ్లి వేడుకలో అపశృతి.. సిలిండర్ పేలుడులో ఐదుగురు మృతి

fire
రాజస్థాన్‌, జోధ్‌పూర్‌లోని ఓ పెళ్లి వేడుకలో విషాదం చోటుచేసుకుంది. పెళ్లి వేడుకలో జరిగిన గ్యాస్ సిలిండర్ పేలుడులో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. 
 
మహిళలు, పిల్లలతో పాటు 60 మంది వివాహ అతిథులు గాయపడ్డారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులు కూడా వున్నారు.  గాయపడిన వారిలో 12 మంది పరిస్థితి విషమంగా వుంది. 
 
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు  అగ్నిమాపక సిబ్బంది క్షతగాత్రులను ఆస్పత్రికి చేరుకున్నారు. గురువారం భుంగ్రా నుంచి వరుడి ఊరేగింపు ప్రారంభం కావడానికి ముందు ఈ ఘటన చోటుచేసుకుందని పోలీసులు తెలిపారు.