బుధవారం, 6 ఆగస్టు 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By సిహెచ్
Last Modified: గురువారం, 13 మార్చి 2025 (23:31 IST)

వేసవి వాతావరణంలో తాగవల్సిన పానీయాలు, ఏంటవి?

drinking water
మనం తీవ్రమైన వేసవి వేడిని ఎదుర్కొంటున్నాము. పరిసర ఉష్ణోగ్రత పెరిగే కొద్దీ శరీరం డీహైడ్రేషన్‌కు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కనుక వేసవి వేడిమిలో డీహైడ్రేషన్ కాకుండా వుండాలంటే ఏం చేయాలో తెలుసుకుందాము.
 
నిర్జలీకరణాన్ని నివారించడానికి తాగునీరు ఉత్తమ మార్గం.
క్రమం తప్పకుండా మంచినీరు త్రాగడం ద్వారా మీ శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకోండి.
నీళ్లు తాగకుండా జ్యూస్‌లు, సాఫ్ట్ డ్రింక్స్ మాత్రమే తాగడం మంచిది కాదు.
నీటి తర్వాత, కొబ్బరి నీళ్లు శరీరానికి ఉత్తమమైనవి.
తర్బూజా రసం లేదంటే ఉప్పు కలిపిన నిమ్మకాయ నీరు కూడా తాగవచ్చు.
ఉప్పు కలిపిన గంజి నీరు కూడా నిర్జలీకరణాన్ని నివారిస్తుంది.
మీ శరీరం వేడికి అలసిపోయినట్లు అనిపిస్తే, మీరు ORS ద్రావణాన్ని త్రాగవచ్చు.
పుచ్చకాయ రసం, చెరుకు రసం కూడా శరీరాన్ని చల్లబరుస్తాయి.