మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 3 ఏప్రియల్ 2021 (10:03 IST)

దేశ వ్యాప్తంగా 7 కోట్ల వ్యాక్సిన్‌ మోతాదులు

దేశ వ్యాప్తంగా కరోనా వైరస్‌ వ్యాక్సిన్ల మోతాదుల సంఖ్య ఏడు కోట్లు దాటిందని కేంద్రం తెలిపింది. శుక్రవారం ఒక్కరోజు రాత్రి 8 గంటల వరకు ఇచ్చిన 12, 76, 191 వ్యాక్సిన్లతో కలిపి ఈ సంఖ్య నమోదైనట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది.

మొత్తం 7,06, 18, 026 మోతాదులు వినియోగించినట్లు తెలిపింది. ఇందులో 6,13,56,345 మంది తొలి డోసు తీసుకున్నారని వెల్లడించింది.

రెండు మోతాదులు తీసుకున్న వారి సంఖ్య 92,61, 681 మంది. వీరిలో 89, 03, 809 మంది ఆరోగ్య కార్యకర్తలున్నారని, 95, 15, 419 మంది 95,15,410 మంది ఫ్రంట్‌ లైన్‌ వర్కర్లు తొలి డోసు తీసుకున్నారని తెలిపింది.

ఇక 52,86, 134 మంది ఆరోగ్య కార్యకర్తలు, 39,75,549 మంది ఫ్రంట్‌ లైన్‌ వర్కర్లు రెండు మోతాదుల వ్యాక్సిన్‌ తీసుకున్నారని పేర్కొంది.

అదేవిధంగా 4,29,37,126 మంది 45 ఏళ్లకు పైబడిన లబ్ధిదారులు వ్యాక్సిన్‌ తొలి మోతాదును తీసుకున్నారని వెల్లడించింది. ఏప్రిల్‌ 2న 45 ఏళ్లు, అంత కన్నా పైబడిన వయస్సుల వారు 11,83, 917 మంది తొలి డోసు తీసుకున్నారని తెలిపింది.

ఏప్రిల్‌ 1న ప్రారంభమైన ఈ వ్యాక్సిన్‌ ప్రక్రియ ద్వారా మొత్తంగా 36.7 లక్షల మంది తొలి మోతాదు తీసుకున్నారని మంత్రిత్వ శాఖ తెలిపింది. కాగా, దేశంలో శుక్రవారం ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం ఒక్క రోజులోనే 81,446 మంది మరణించిన సంగతి విదితేమ. ఈ సంఖ్యతో 1,23,03,131 మంది కరోనా బారిన పడ్డారు.