శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : శనివారం, 27 మే 2017 (12:53 IST)

గుజరాత్‌లో ఘోరం.. తల్లితో కలిసి నిద్రపోతున్న బాలికపై సామూహిక అత్యాచారం..

గుజరాత్ రాష్ట్రంలో ఘోరం జరిగింది. తల్లితో కలిసి నిద్రపోతున్న ఏడేళ్ల బాలికను కూడా కామాంధులు వదిలిపెట్టలేదు. పదేళ్లు కూడా నిండని బాలికపై కామపిశాచులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. వివరాల్లోకి వెళితే

గుజరాత్ రాష్ట్రంలో ఘోరం జరిగింది. తల్లితో కలిసి నిద్రపోతున్న ఏడేళ్ల బాలికను కూడా కామాంధులు వదిలిపెట్టలేదు. పదేళ్లు కూడా నిండని బాలికపై కామపిశాచులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. వివరాల్లోకి వెళితే.. ట్రాన్స్ యమునా రీజియన్ పరిధిలోని అమరేహ బుదవాన్ గ్రామంలో ఏడేళ్ల బాలిక తల్లితో కలిసి నిద్రపోతుంది. 
 
ఉన్నట్టుండి.. నలుగురు గుర్తుతెలియని వ్యక్తులు బాలికను పొలాల్లోకి ఎత్తుకెళ్లి గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారు. రక్తపు మడుగులో పడి ఉన్న బాలికను గ్రామస్థులు చూసి ఆమెను ఆసుపత్రికి తరలించారు.

బాలికను పరీక్షించిన వైద్యులు ఆమెపై అత్యాచారం జరిగిందని.. బాలిక పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని.. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు చేపట్టారు.