శుక్రవారం, 15 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Raju
Last Updated :హైదరాబాద్ , శుక్రవారం, 14 జులై 2017 (09:23 IST)

పొట్టలో నొప్పిగా ఉంది చూడవా ప్లీజ్... ఆస్పత్రి కొచ్చి అడుక్కున్న వానరం

పల్లెనుంచి తప్పిపోయి వచ్చి అడవిలోకి వచ్చిన చిన్న పాపను అక్కున చేర్చుకుని తమలో ఒకటిగా పెంచిన అడవి వానరాలు చివరకు ఆ పాపను తమనుంచి విడదీసినప్పుడు రోజుల తరబడి ఆ పాపను ఉంచిన ఆసుపత్రి చుట్టూ కాపు కాచిన ఘటన

పల్లెనుంచి తప్పిపోయి వచ్చి అడవిలోకి వచ్చిన చిన్న పాపను అక్కున చేర్చుకుని తమలో ఒకటిగా పెంచిన అడవి వానరాలు చివరకు ఆ పాపను తమనుంచి విడదీసినప్పుడు రోజుల తరబడి ఆ పాపను ఉంచిన ఆసుపత్రి చుట్టూ కాపు కాచిన ఘటన భారత్‌లో చాలామంది హృదయాలను కలిచివేసింది. అడవిలోని వానరం మనిషితో సంబంధంలోకి వచ్చాక అవి ఎంత అనుబంధం పెంచుకుంటాయో దేవాలయాల్లో తచ్చాడే కోతుల్ని చూస్తే తెలుస్తుంది.

మనిషి తనకు తినుబండారాలు పెట్టే సందర్భం వచ్చినప్పుడు ఆ వానరం చూపే ఆత్మీయత దాని కరస్పర్శతోటే తెలిసిపోతుంది. భయపడుతూ భయపడుతూనే ఆలయంలో వానరానికి తినుపదార్థాలు అందించే పిల్లలు, పెద్దలు దాని మెత్తటి కరస్పర్స అనుభవించి ఆత్మానందం పొందడమూ చాలామందికి అనుభవమే. కోపం వస్తే అదే చేతిగోళ్లతో రక్తం వచ్చేలా బరికేసే కోతి తనకు తిండి పెట్టే సందర్భంలో ఆ మనిషి చేతిని ఎంతమెత్తగా తాకుతోందో ఆ అనుభవం ఉన్నవారికే అర్థమవుతుంది.
 
ఇప్పుడు మైదానాల్లోకి వచ్చిన కోతి తన అనారోగ్య సమస్యను మనిషితో కాకుండా తోటి కోతితో చెప్పుకునే పరిస్థితి లేనట్లుంది. ఉత్తరాఖండ్‌లో ఆ వానరాజం తన అనారోగ్యాన్ని నర్సుతో చెప్పుకుని ఎలా పరిష్కరించుకుందో చూడండి. 
 
మనకి ఆరోగ్యం బాగా లేకపోతే వైద్యుడిని సంప్రదించి చికిత్స చేయించుకుంటాం. అదేవిధంగా ఉత్తరాఖండ్‌లోనూ ఓ కోతి ఆరోగ్య బాగాలేదని వైద్యుడికి దగ్గరకు వెళ్లి ఆశ్చర్యపరిచింది. ఉత్తరాఖండ్‌ రాజధాని డెహ్రాడూన్‌లో అనారోగ్యంతో బాధపడుతున్న ఓ వానరం స్థానిక హాస్పిటల్‌కి వెళ్లి ఏకంగా డాక్టర్‌ టేబుల్‌పై కూర్చుంది. డాక్టర్‌ వచ్చే వరకు కాసేపు టేబుల్‌పై పడుకుంది. అంతేకాదు అక్కడే ఉన్న సెలైన్‌ తీసుకుని తాగేసింది. 
 
కొద్దిసేపటి తర్వాత అక్కడున్న ఓ వ్యక్తి దానికి అరటిపండు ఇచ్చినా అది తినలేదు. ఆ తర్వాత నర్సు దాని వద్దకు వస్తే పొట్ట చూపిస్తూ దాని భాషలో సమస్య చెప్పుకుంది. ఆ తర్వాత నర్సు ఇచ్చిన సెలైన్‌ బాటిల్‌ తాగుతూ కూర్చుంది. అలా మూడు బాటిళ్ల సెలైన్‌ తాగి అక్కడి నుంచి వెళ్లిపోయింది. 
 
ఈ దృశ్యాన్ని హాస్పిటల్‌కి వచ్చిన వాళ్లలో కొందరు వీడియో తీయడంతో వైరల్‌ అయింది. 

ఆ వానరం మానవజాతి పూర్వీకురాలు అంటే ఇప్పుడు నమ్ముతారు కదూ..