జయ రక్తంతో కూడిన గాయాలతో ఆస్పత్రిలో చేరారు-ఇడ్లీ తిన్నారని తంబిదురై చెప్పమన్నారు
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత రక్తంతో కూడిన గాయాలతో అపోలో ఆస్పత్రిలో చేరారని అన్నాడీఎంకే సీనియర్ నేత పొన్నయన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమ్మ మరణంపై సమగ్ర విచారణ జరపాలని ఓపీఎస్ వర్గం విజ్ఞప్తి చేసిం
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత రక్తంతో కూడిన గాయాలతో అపోలో ఆస్పత్రిలో చేరారని అన్నాడీఎంకే సీనియర్ నేత పొన్నయన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమ్మ మరణంపై సమగ్ర విచారణ జరపాలని ఓపీఎస్ వర్గం విజ్ఞప్తి చేసింది. ఈ నేపథ్యంలో ఆమె మరణం అంతుచిక్కని కథలా మిగిలిపోయిందని పొన్నయన్ తెలిపారు.
సెప్టెంబర్ 22వ తేదీ రాత్రి పోయెస్ గార్డెన్‌లోని ఇంట్లో జయలలిత దాడికి గురయ్యారని, కిందపడిపోయారని.. అనాధలా ఆమెను అపోలోలో చేర్చినట్లు పొన్నయన్ చెప్పుకొచ్చారు.
మా కళ్లల్లో కారం కొట్టి.. అమ్మ చెంపపై రక్తపు మరకలతో ఆమెను ఆస్పత్రిలో చేర్చారు. జయలలిత కింద పడినప్పుడు కళ్లారా చూసిన పనిమనిషి కనిపించట్లేదని.. ఆమె ఎక్కడున్నారో తెలియట్లేదన్నారు.
జయలలిత ఆస్పత్రిలో ఉన్నప్పుడు అమ్మ ఆరోగ్యంగా ఉన్నారు. ఇడ్లీ తిన్నారు.. అని చెప్పాం. అలా లోక్ సభ డిప్యూటీ స్పీకర్ తంబిదురై చెప్పమన్నారని బాంబు పేల్చారు. తంబిదురై చెప్పినట్లే తాము కూడా మీడియాతో చెప్పామని పొన్నయన్ స్పష్టం చేశారు.