శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 22 జులై 2022 (19:52 IST)

ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ -కేరళలో మరో జిల్లాలకు హై అలర్ట్

కేరళలో మరోసారి కొత్త వైరస్ బయటపడింది. ఇప్పటికే దేశంలో మంకీపాక్స్ వైరస్ కేసులు కేరళలోనే తొలుత బయటపడ్డాయి. కేరళలోని వయనాడ్ జిల్లాలోని మనంతవాడి పందుల ఫారాల్లో ఈ వ్యాధి వెలుగులోకి వచ్చింది. 
 
ఇటీవల వరసగా పందులు మూకుమ్మడిగా చనిపోవడంతో పశువైద్యాధికారులు వీటి నమూనాలను భోపాల్ లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ యానిమల్ డిసీజెస్‌‌కు పంపారు. దీంతో పందులకు ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ వ్యాధి సోకినట్లు వెల్లడైంది. 
 
దీంతో ప్రస్తుతం పందుల ఫారాల్లో ఉన్న 300 పందులను చంపేయాలని అధికారుల ఆదేశాలు జారీ చేశారు. దీంతో పాటు పరిసరాల్లో రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న అన్ని పందులను చంపాలని యోచిస్తున్నారు.
 
వయనాడ్‌తో పాటు నార్త్ కేరళలో మరో జిల్లాలకు హై అలర్ట్ ప్రకటించారు అధికారులు. తాజాగా కేరళలో ఈ వ్యాధి బయటపడింది. ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ పందులను ప్రభావితం చేస్తే అత్యంత ప్రమాదకరమైన అంటువ్యాధి అని అధికారులు చెప్పారు.