ఉద్యోగ పోస్టుల భర్తీలో రైల్వే శాఖ కీలక నిర్ణయం... వేలాది మందికి లబ్ది
రైల్వే శాఖ చేపట్టనున్న అసిస్టెంట్ లోకో పైలెట్ (ఏఎల్పీ) ఉద్యోగాల భర్తీకి వయో పరిమితిలో రైల్వే శాఖ కీలక మార్పు చేసింది. ఇటీవల వెల్లడైన నోటిఫికేషన్‌లో ఏకంగా 5,600 లోకో పైలెట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతుంది. ఆసక్తిగల అభ్యర్థులకు ఫిబ్రవరి 19వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకునే వెసులుబాటు ఉంది. ఈ నేపథ్యంలో రైల్వే మంత్రిత్వ శాఖ వయోపరిమితిలో కీలక మార్పు చేసింది.
గతంలో ఇచ్చిన నోటిఫికేషన్‌లో అభ్యర్థు వయోపరిమితి 18 నుంసి 30 యేళ్లుగా పోర్కొన్నారు. ఇపుడు గరిష్ట వయోపరిమితిని 33 యేళ్లకు పెంచారు. అలాగే, దరఖాస్తు చేసుకునేవారు చివరి నిమిషం వరకు వేచి చూడకుండా ముందుగానే దరఖాస్తు చేసుకోవాలని రైల్వే అధికారులు సూచించారు.
పరీక్షల టైం లైన్‌ను పరిశీలిస్తే...
కంప్యూటర్ ఆధారిత పరీక్ష జూన్ ఆగస్టు నెలల మధ్య జరిగే అవకాశం ఉంది. రెండో దశ కంప్యూటర్ ఆధారిత పరీక్ష సెప్టెంబరు నిర్వహించే వీలుదుంది. ఆప్టిట్యూడ్ టెస్ట్ నవంబరు నెలలో నిర్వహిస్తారు. ఆప్టిట్యూడ్ టెస్ట్ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థుల జాబితాను నవంబరు డిసెంబరు నెలలో విడుదల చేసే అవకాశం ఉంది. మరిన్ని ఏఎల్‌పీ ఉద్యోగాల కోసం కొత్త నోటిఫికేషన్‌ను వచ్చే యేడాది జనవరి నెలలో విడుదల చేసే అవకాశం ఉన్నట్టు రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది.