హల్లో అఖిలేష్.. ఈ దఫా సీఎం అభ్యర్థివి కావు... తనయుడికి తండ్రి ములాయం ఝులక్
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్‌కు ఆయన తండ్రి, సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ తేరుకోలేని షాకిచ్చారు. వచ్చే యేడాది జరిగే రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో ఎస్పీ తరపున ముఖ్యమంత్రి అభ్యర్థిగా
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్‌కు ఆయన తండ్రి, సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ తేరుకోలేని షాకిచ్చారు. వచ్చే యేడాది జరిగే రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో ఎస్పీ తరపున ముఖ్యమంత్రి అభ్యర్థిగా అఖిలేష్ పేరును ప్రకటించబోమని ఆయన తేల్చిచెప్పారు. ఈ ప్రకటన అఖిలేష్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులు తేరుకోలేని షాక్‌కు గురయ్యారు.
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ తదుపరి ఎన్నికల్లో పార్టీ తరపున ముఖ్యమంత్రి అభ్యర్థి ఉండరని, ఎన్నికల తర్వాత మెజారిటీ వస్తేనే ముఖ్యమంత్రి ఎవరన్న విషయాన్ని ప్రకటిస్తామని వివరణ ఇచ్చారు. ఎన్నికల ఫలితాలను బట్టి ముఖ్యమంత్రి అభ్యర్థిని పార్టీ ఎన్నుకుంటుందని తెలిపారు.
ములాయం చేసిన వ్యాఖ్యలు సొంత పార్టీలోనేకాకుండా, ఆ రాష్ట్ర రాజకీయాల్లో సైతం పెను సంచలనంగా మారింది. ఇప్పటివరకూ ముఖ్యమంత్రి అభ్యర్థిగా అఖిలేషే మినహా మరో పేరును కూడా ఊహించుకోని సమాజ్ వాదీ పార్టీ కార్యకర్తలు, తమ అధినేత చెప్పిన మాటల వెనుక ఏ వ్యూహముందా? అని చర్చించుకుంటున్నారు. కాగా, పలు సంస్థలు ఎన్నికల సర్వేలు చేసి, ఈ దఫా యూపీలో హంగ్ అసెంబ్లీ వస్తుందని, సమాజ్ వాదీ పార్టీ అధికారాన్ని కోల్పోనుందని అంచనాలు వేస్తున్న సంగతి తెలిసిందే.