శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 29 మే 2020 (08:38 IST)

రైలు ప్రయాణీకులకు విజ్ఞప్తి! రైలెక్కాలంటే గంటన్నర ముందుగా స్టేషన్‌కు వెళ్లాల్సిందే

రైలు ప్రయాణీకులకు విజ్ఞప్తి. మీరు రైలెక్కాలంటే గంటన్నర ముందుగా స్టేషన్ కు వెళ్లాలి. జూన్‌ ఒకటో తేదీ నుండి దేశవ్యాప్తంగా 200 రైళ్లు తిరగనున్న నేపథ్యంలో జోన్‌ స్థాయిలో తీసుకోవాల్సిన చర్యలపై దక్షిణ మధ్య రైల్వే తన ఉద్యోగుస్తులకు, ప్రయాణీకులకు మార్గదర్శకాలను విడుదల చేసింది.

దీని ప్రకారం ప్రయాణీకుడు గంటన్నర ముందుగానే రైల్వే స్టేషన్‌కు చేరుకోవాలి. అతనికి స్టేషన్‌లో ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తాడు. ప్రతి ప్రయాణీకుడు తప్పనిసరిగా మాస్క్‌ ధరించాలి.

టిక్కెట్‌ లేని వారు స్టేషన్‌లోకే రాకూడదు. ప్రతి రైలుకు ఒక కెప్టెన్‌ను నియమిస్తారు. టికెట్‌ తనిఖీ సిబ్బందిలో సీనియర్‌ను రైలు కెప్టెన్‌గా నియమిస్తారు. ఈ కెప్టెన్‌ రైలులోని సిబ్బందితో, రాష్ట్ర ప్రభుత్వ సిబ్బందితో సమన్వయం చేసుకోవాలి.

రైల్లో ఎవరికైనా కోవిడ్‌ లక్షణాలు ఉన్నట్లు గమనిస్తే వెంటనే అధికారులకు తెలియజేయాలి. టికెట్‌ తనిఖీ సిబ్బందికి, టికెట్‌ బుకింగ్‌ సిబ్బంది ఎన్‌ 95 మాస్క్‌లు, ఫేస్‌ షీల్ట్‌లు, గ్లౌజులు, శానిటైజర్లు అందించాలి.

రైల్వే స్టేషన్లలో ప్రవేశ, నిష్క్రమణ మార్గాలు వేర్వేరుగా ఉండాలి. అక్కడ శానిటైజర్లు ఏర్పాటు చేయాలి. స్టేషన్లలో కూలీల సంఖ్యను తగ్గించాలి.వారికి కూడా మాస్క్‌లు, గ్లౌజులు, శానిటైజర్లు ఇవ్వాలి.