ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 11 ఆగస్టు 2022 (11:49 IST)

రేషన్ దుకాణాల్ల త్రివర్ణ పతాకాలు విక్రయమా? సిగ్గు చేటు : రాహుల్ గాంధీ

rahul gandhi
దేశంలో 75వ సాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకలను కేంద్రం ఈ నెల 13వ తేదీ నుంచి 15వ తేదీ వరకు నిర్వహించనుంది. దీన్ని పురస్కరించుకుని ప్రతి ఒక్క ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేయాలని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. ఇందుకోసం జాతీయ జెండాలను ప్రతి ఒక్క రేషన్ దుకాణంలో విక్రయించేలా ఒత్తిడి చేస్తున్నారు. దీన్ని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్రంగా వ్యతిరేకించారు. 
 
రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరూ జాతీయ జెండాను కొనుగోలు చేయాలంటూ ఒత్తిడి చేస్తున్నారని ఆరోపించారు. జాతీయవాదాన్ని భారతీయ జనతా పార్టీ పాలకలు అమ్మకానికి పెట్టిందని, పేదల ఆత్మాభిమానాన్ని గాయపరుస్తోందని ఆయన మండిపడ్డారు. మువ్వన్నెల పతాకం ప్రతి ఒక్కరికీ గర్వకారణమని, అది అందరి హృదయాల్లో నిలిచి ఉంటుందని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. 
 
"జాతీయవాదం ఎప్పటికీ అమ్ముడుపోదు. రేషన్ దుకాణాల్లో సరుకులు ఇస్తూ రూ.20తో జాతీయ జెండాను కూడా కొనుగోలు చేయాలని చెప్పడం సిగ్గుచేటు" అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు కొందరు రేషన్ కార్డుదారులు తమను జాతీయ జెండా కొనుగోలు చేయాలని బలవంతం చేస్తున్నారంటూ చెబుతున్న వీడియోను కూడా రాహుల్ గాంధీ సోషల్ మీడియాలో షేర్ చేశారు.