కరోనా వైరస్ రూపు మార్చుకుని వస్తున్నదన్న వార్తలలో ఎంత వరకు నిజం ఉంది? ఈ వార్తలపై వివిధ దేశాలకు చెందిన రాజకీయ నాయకులు చకచకా చర్యలు తీసేసుకుంటున్నారు. కరోనా ప్రపంచవ్యాప్తంగా తగ్గలేదు కదా? తగ్గకపోయినా కూడా లాక్ డౌన్ లను ఎత్తేస్తూ పోయిన ప్రభుత్వాలు మళ్లీ లాక్ డౌన్ లు రాత్రి కర్ఫ్యూలు ప్రారంభించడం ఏమిటి? ఇవన్నీ సమాధానం లేని ప్రశ్నలుగానే మిగిలిపోవడం ప్రస్తుతం అత్యంత దురదృష్టకరం.
కరోనా తీవ్రత తగ్గడం, కరోనా వ్యాక్సిన్ రావడం అనే రెండు అంశాలను కలిపి చూస్తే ఇప్పుడు వస్తున్న కొత్త స్ట్రెయిన్ వార్తల వెనుక ఏదైనా దురుద్దేశ్యం ఉందా అనే అనుమానాలు వ్యక్తం కావడం సహజం. వ్యాక్సిన్ సిద్ధం అయ్యే నాటికి కరోనా తీవ్రత పూర్తిగా తగ్గిపోతున్నది.
ఇక ఇప్పుడు కరోనా వ్యాక్సిన్ ఎవరు వేయించుకుంటారు? చాలా మంది తగ్గిపోయిన కరోనా కారణంగా వ్యాక్సిన్ గురించి ఆలోచించడం లేదు. పెద్ద పెద్ద కంపెనీలు కరోనా వ్యాక్సిన్ తయారు చేస్తున్నాయి.
స్పూత్నిక్ వ్యాక్సిన్ పై కుట్రపూరిత ఆరోపణలు
రష్యా ప్రభుత్వ సహాయంతో రూపొందిన స్పూత్నిక్ వ్యాక్సిన్ పని చేయడం లేదని పుకార్లు వ్యాప్తి చేయడం వెనక కుట్ర ఉందని అప్పటిలో ఆరోపణలు వెల్లువెత్తాయి. అదే విధంగా అమెరికాకు చెందిన ఫైజర్ కంపెనీ కరోనా వ్యాక్సిన్ తయారు చేసింది. తొలి సారిగా దాన్ని బ్రిటన్ లోనే పంచి పెడుతున్నారు.
కొత్త స్ట్రెయిన్ కు పాత కరోనాకు లక్షణాలలో తేడా ఏమిటి?
ఈ దశలో కరోనా రూపు మార్చుకున్నదని కొత్త స్ట్రెయిన్ వచ్చిందని పుకార్లు వ్యాప్తి చెందాయి. కొత్త స్ట్రెయిన్ లక్షణాలు ఏమిటి? ఇప్పటి వరకూ ఉన్న కరోనా లక్షణాలకు, కొత్త స్ట్రెయిన్ తో ఉన్న కోవిడ్ 19 లక్షణాలు ఏమిటి? కరోనా వైరస్ వచ్చిన నాటి నుంచి చేస్తున్న పరీక్షలనే ఇప్పుడు కూడా చేస్తున్నారు. లండన్ నుంచి వస్తున్న వారికి కరోనా సాంప్రదాయ పరీక్షలనే చేస్తున్నారు.
కరోనా లక్షణాలు ఉన్న వారిని గుర్తించి క్వారంటైన్ కు పంపుతున్నారు. మరి అలాంటప్పుడు కొత్త స్ట్రెయిన్ వచ్చినందువల్ల నష్టం ఏమిటి? మళ్లీ పాత పద్ధతిలోనే రోగ నిర్ధారణ, రోగ చికిత్స జరుగుతున్నప్పుడు ఈ కొత్త స్ట్రెయిన్ ప్రస్తావన ఎందుకు వస్తున్నది? అదీ కూడా ఫైజర్ కంపెనీ వ్యాక్సిన్ ను పంపిణీ చేస్తున్న బ్రిటన్ లోనే ఎందుకు ఈ పుకార్లు వ్యాప్తి చెందుతున్నాయి?
ఈ కొత్త స్ట్రెయిన్ కు కూడా ఆరు వారాల్లో కొత్త వ్యాక్సిన్ తెస్తామని కొన్ని కంపెనీలు అప్పుడే ప్రకటిస్తున్నాయి. ఏం తమాషానా? ఇప్పటికి కరోనాకే సరైన వ్యాక్సిన్ వచ్చిందో లేదో తెలియదు. అది పని చేస్తుందో లేదో తెలియదు. మళ్లీ కొత్త స్ట్రెయిన్ కు వ్యాక్సినా?
విమానాలు ఆపితే వైరస్ ఆగుతుందా?
ప్రపంచ దేశాలకు సంబంధించిన శాస్త్రవేత్తలు మాట్లాడకుండా కేవలం రాజకీయ నాయకులు మాత్రమే నిర్ణయాలు ఎలా తీసుకుంటున్నారు? విమానాలు నిలుపుదల చేయడం, రాత్రి కర్ఫ్యూలు పెట్టాలి అనే రాజకీయ వ్యవస్థ తీసుకునే నిర్ణయాలతో ప్రపంచ వ్యాప్తంగా ప్రజల్లో భయాందోళనలు ఎక్కువ కావా?
అసలు వ్యాక్సిన్ ఎప్పుడు వస్తున్నది? అందరికి ఎప్పుడు ఇస్తున్నారు అనే అంశంపైనే క్లారిటీ లేదు. ఒకరు 2022 వరకూ పడుతుందని చెప్పారు. మరొకరు మాత్రం దేశంలోని అందరికి వ్యాక్సిన్ అవసరం లేదు అని చెప్పారు. ఇలా ఎవరికి ఇష్టం వచ్చింది వారు చెబుతున్నారు తప్ప క్లారిటీ లేదు.
మన దేశంలో నే కాదు అమెరికాలో కూడా ఇదే పరిస్థితి ఉంది.
ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ తీవ్రత తగ్గింది కాబట్టి ఈ దశలో వ్యాక్సిన్లు అమ్ముకోవడం కష్టం అవుతుందేమోనని కొన్ని కంపెనీల వారు ఏమైనా ఇలా కొత్త స్ట్రెయిన్ తో కరోనా వస్తున్నట్లు పుకార్లు రేపారా? కొత్త స్ట్రెయిన్ పై పూర్తి వివరాలు చెప్పడం రాజకీయ నాయకులు చేయాల్సిన పని కాదు. శాస్త్రవేత్తలు చెప్పాలి.