ఆదివారం, 17 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : బుధవారం, 25 జనవరి 2017 (09:20 IST)

రైల్వే శాఖ నష్టపరిహారం ఇవ్వలేదు.. వాట్సాప్‌లో బెంగూళూరు యూత్ సూసైడ్ నోట్

బెంగుళూరుకు చెందిన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. తన సూసైడ్ విషయాన్ని సోషల్ మీడియా ట్విట్టర్ ఖాతాలో వెల్లడించి ఆ తర్వాత బలవన్మరణానికి పాల్పడ్డాడు. పైగా, తన ఆత్మహత్యకు రైల్వేశాఖ కారణమని ఆ సూసైడ్ నోట్

బెంగుళూరుకు చెందిన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. తన సూసైడ్ విషయాన్ని సోషల్ మీడియా ట్విట్టర్ ఖాతాలో వెల్లడించి ఆ తర్వాత బలవన్మరణానికి పాల్పడ్డాడు. పైగా, తన ఆత్మహత్యకు రైల్వేశాఖ కారణమని ఆ సూసైడ్ నోట్‌లో పేర్కొన్నాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
సిద్దాపుర గ్రామానికి చెందిన శరణప్ప తండ్రి మడివాళప్పకు చెందిన  148/5 టి 1 సర్వే నెంబర్‌లోని భూమిని రైల్వే శాఖ పోలీసులతో స్వాధీనం చేసుకుంది. అయితే స్వాధీనం చేసుకొన్న భూమికి డబ్బు ఇవ్వలేదు. దీంతో విరక్తి చెందిన శరణప్ప ఆత్మహత్య చేసుకున్నాడు. రైల్వే శాఖ స్వాధీనం చేసుకున్న భూమికి నష్టపరిహారం ఇవ్వలేదని అందుకే తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని శరణప్ప తన సూసైడ్ నోట్‌లో పేర్కొన్నాడు. దీనిపై పోలీసులు నమోదు చేసి కేసు దర్యాప్తు చేపట్టారు.