మూత్ర విసర్జన కోసం వడ్రంగిపై పైశాచిక దాడి.. నాలుక, మర్మాంగాలను కత్తితో?
మూత్ర విసర్జన కోసం వచ్చిన వడ్రంగిపై గుర్తు తెలియని వ్యక్తులు పైశాచికంగా దాడి చేశారు. అతని నాలుక, మర్మాంగాన్ని కోసి పారిపోయారు. బెంగుళూరు వైట్ ఫీల్డ్‌లో నిర్మాణంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇమ్మడిహళ్ళిలో ని
మూత్ర విసర్జన కోసం వచ్చిన వడ్రంగిపై గుర్తు తెలియని వ్యక్తులు పైశాచికంగా దాడి చేశారు. అతని నాలుక, మర్మాంగాన్ని కోసి పారిపోయారు. బెంగుళూరు వైట్ ఫీల్డ్‌లో నిర్మాణంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇమ్మడిహళ్ళిలో నిర్మాణంలో ఉన్న భవనంలో ఒడిశాకు చెందిన బిజా నాయక్ వడ్రంగిగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఆయన అక్కడే నివాసం ఉంటున్నాడు. ఇతడు శుక్రవారం రాత్రి మూత్రవిసర్జన కోసం బయటకు వచ్చాడు.
అయితే అక్కడే కాపు కాసిన నలుగురు ఆగంతకులు బిజూనాయక్‌పై దాడి చేశారు. అతని నాలుక, మర్మాంగాలను కత్తితో కోసేశారు. తమకు గుర్తించకుండా ఆగంతకులు ముసుగులు ధరించారని బాధితుడు పోలీసులకు రాతపూర్వకంగా తెలిపారు. పాతకక్షలు లేదా వివాహేతర సంబంధాల నేపథ్యంలోనే స్నేహితులే బిజూపై దాడి చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.