శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 14 అక్టోబరు 2016 (09:42 IST)

ఆర్మీ ఉగ్రవాదులకు ఎందుకు సహకరిస్తోంది : సర్కారును కడిగిపారేసిన పాక్ యువతి

ఉగ్రవాదులకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్న పాకిస్థాన్ ఆర్మీతో పాటు.. ఆ దేశ ప్రభుత్వాన్ని పాకిస్థాన్ యువతి ఒకరు కడిగిపారేసింది. ‘మిలటరీలో టెర్రరిజం పాత్ర’ అనే అంశంపై మాట్లాడుతూ ఆ యువతి పాక్ మిలటరీని

ఉగ్రవాదులకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్న పాకిస్థాన్ ఆర్మీతో పాటు.. ఆ దేశ ప్రభుత్వాన్ని పాకిస్థాన్ యువతి ఒకరు కడిగిపారేసింది. ‘మిలటరీలో టెర్రరిజం పాత్ర’ అనే అంశంపై మాట్లాడుతూ ఆ యువతి పాక్ మిలటరీని తూర్పారబట్టింది. ఉగ్రవాదులకు ఎందుకు సహకరిస్తున్నారని నిలదీసింది. 
 
దేశంలో ఉగ్రవాదం పెరగడానికి గల కారణమేంటని ప్రశ్నించింది. ప్రభుత్వ తీరును ఎండగట్టింది. అవినీతి రాజకీయ నాయకులపైనా దుమ్మెత్తి పోసింది. స్పష్టంగా, సూటిగా మాట్లాడుతున్న ఆమెను చూసి అక్కడున్నవారు కన్నార్పడం కూడా మర్చిపోయారు. ఆమె ప్రసంగానికి ముగ్దులయ్యారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. 
 
యురీ ఉగ్రదాడి తర్వాత భారత్-పాకిస్థాన్ మధ్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్న విషయం తెలిసిందే. పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో భారత్ జరిపిన సర్జికల్ దాడుల తర్వాత రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఓ దశలో యుద్ధం తప్పదన్న సంకేతాలు వెళ్లాయి. భారత్‌లో జరుగుతున్న ఉగ్రదాడులకు పాక్ వైపు నుంచి పూర్తిగా మద్దతు ఉందనేది జగద్విదితం.