మంగళవారం, 11 ఫిబ్రవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ivr
Last Modified: శుక్రవారం, 2 సెప్టెంబరు 2016 (19:02 IST)

దారుణం... బైకుపై గర్ల్ ఫ్రెండుతో ఫీట్స్... ఆమె కిందపడింది... ఆమె పైకి వాహనమెక్కినా పట్టకుండా పరార్...

బెంగళూరు నగరంలో గురువారం రాత్రి ఓ దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ యువకుడు తన గర్ల్ ఫ్రెండును బైకుపై ఎక్కించుకుని బెంగళూరు నగర వీధుల్లో ఫీట్స్ చేస్తూ వెళ్లడం మొదలుపెట్టాడు. బైకును పాము మెలికల్లా తిప్పుతూ రోడ్డుపై విన్యాసాలు చేసుకుంటూ వెళుతుండగా బైకు అదుపు

బెంగళూరు నగరంలో గురువారం రాత్రి ఓ దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ యువకుడు తన గర్ల్ ఫ్రెండును బైకుపై ఎక్కించుకుని బెంగళూరు నగర వీధుల్లో ఫీట్స్ చేస్తూ వెళ్లడం మొదలుపెట్టాడు. బైకును పాము మెలికల్లా తిప్పుతూ రోడ్డుపై విన్యాసాలు చేసుకుంటూ వెళుతుండగా బైకు అదుపు తప్పింది. వెనుక కూర్చున్న యువతి కిందపడిపోయింది. ఆ వెంటనే వారి వెనుకే వస్తున్న ఓ వాహనం ఆమె పైకి ఎక్కేసింది. దాంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది.
 
వెంటనే తేరుకుని లేచిన యువకుడు తన గర్ల్ ఫ్రెండ్ పరిస్థితి ఎలా ఉందో కూడా చూడకుండా నిర్దయగా తన బైకును తీసుకుని పారిపోయాడు. యువతిపైకి ఎక్కించిన వాహనం డ్రైవరు సైతం పారిపోయాడు. ఇదంతా అక్కడ స్థానికులు గమనిస్తూనే ఉన్నారు. రోడ్డుపై ప్రాణాలు విడిచి అనాధలా పడి ఉన్న ఆమె శవాన్ని ఆసుపత్రికి తరలించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
 
ఫిర్యాదు అందుకున్న పోలీసులు ఆ యువతి వివరాలను తెలుసుకున్నారు. ఆమె పేరు షైనీ కిరణ్ అని, కోరమంగళ ఆర్జేఎస్ కళాశాలలో పీయూసి చదువుతోందని పోలీసులు వెల్లడించారు. బైకును నడిపిన యువకుడికి 17 ఏళ్లు ఉంటాయనీ, అతడి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. ఈ ఘటన బెంగళూరు లోని ఓల్డ్ మద్రాస్ రోడ్డులో జరిగింది.