సోమవారం, 18 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ivr
Last Updated : శుక్రవారం, 2 డిశెంబరు 2016 (14:41 IST)

ఐటీ దాడులు... రూ.5 కోట్ల రూ.2000 కరెన్సీ నోట్ల కట్టలు... ఏ బ్యాంకు మోసం...?

బెంగళూరు: రూ.500, రూ.1000 నోట్ల రద్దుతో గంటల తరబడి క్యూలో నిల్చుంటున్నా రూ.20 వేలలోపే డబ్బు తీసుకునే వీలుంటోంది. ఐతే నల్లకుబేరుల సత్తా ఏమిటో మరోసారి వెలుగులోకి వచ్చింది. అదేమిటంటే... ఇద్దరు సీనియర్ అధికారుల ఇళ్లలో ఏకంగా రూ.ఐదు కోట్లు ఆదాయపన్ను శాఖ అధ

బెంగళూరు: రూ.500, రూ.1000 నోట్ల రద్దుతో గంటల తరబడి క్యూలో నిల్చుంటున్నా రూ.20 వేలలోపే డబ్బు తీసుకునే వీలుంటోంది. ఐతే నల్లకుబేరుల సత్తా ఏమిటో మరోసారి వెలుగులోకి వచ్చింది. అదేమిటంటే... ఇద్దరు సీనియర్ అధికారుల ఇళ్లలో ఏకంగా రూ.ఐదు కోట్లు ఆదాయపన్ను శాఖ అధికారులు గుర్తించారు. కేంద్ర ప్రభుత్వం రెండు వారాల కిందటే విడుదల చేసిన కొత్త రూ.2000 నోట్ల లోనే దాదాపు ఈ డబ్బంతా ఉంది.
 
అంతేకాదు, ఆ ఇద్దరు అధికారుల ఇళ్లలో ఐదు కేజీల బంగారం, ఐదు కేజీల ఆభరణాలు, స్పోర్ట్స్‌ కార్లు, లాంబార్గిని వంటివి కూడా లభ్యమయ్యాయి. బెంగళూరులోని ఓ ఇద్దరు సీనియర్ అధికారుల ఇళ్లపై ఐటీ దాడులు నిర్వహించగా ఇవన్నీ బయటపడ్డాయి. జనాలు డబ్బుల్లేక అల్లాడుతుంటే ఇంత పెద్ద మొత్తంలో కొత్త డబ్బు ఎలా చేతికొచ్చిందని ప్రస్తుతం అధికారులు ప్రశ్నిస్తున్నారు. 
 
అయితే, ఆ అధికారుల వివరాలు మాత్రం ఇంకా వెలుగులోకి తీసుకురాలేదు. వీరికి పలు బ్యాంకు అధికారులు సహాయసహకారాలు అందించినట్లు వార్తలు వస్తున్నాయి. ప్రజల నోళ్లలో మన్నుకొట్టి ఆ డబ్బును ఇలా పక్కదారికి మళ్లించి మోసం చేసిన ఆ బ్యాంకుల వివరాలు ఏమిటో ఇంకా తెలియాల్సి ఉంది.