బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : శనివారం, 4 ఫిబ్రవరి 2017 (11:35 IST)

సన్నీలియోన్‌ను ఆదర్శంగా తీసుకోమన్నాడు.. కేవీ విద్యార్థినిపై ప్రిన్సిపాల్ లైంగిక వేధింపులు..

విద్యార్థినితో ఏ ప్రిన్సిపాల్ అసభ్యంగా ప్రవర్తించాడు. అదీ చాలక సన్నీలియోన్‌ను ఆదర్శంగా తీసుకోమన్నాడు. బాయ్‌ఫ్రెండ్ పెట్టుకోమన్నాడు. శృంగార సాధనాలు వాడమన్నాడు. తనను తరచూ కలవమన్నాడు. అలా చేస్తే తాను ఆర్

విద్యార్థినితో ఏ ప్రిన్సిపాల్ అసభ్యంగా ప్రవర్తించాడు. అదీ చాలక సన్నీలియోన్‌ను ఆదర్శంగా తీసుకోమన్నాడు. బాయ్‌ఫ్రెండ్ పెట్టుకోమన్నాడు. శృంగార సాధనాలు వాడమన్నాడు. తనను తరచూ కలవమన్నాడు. అలా చేస్తే తాను ఆర్థికంగా మద్దతిస్తానని భరోసా ఇచ్చాడు. కానీ తన మాట వినకపోతే మాత్రం ఫస్ట్ మార్కులు వచ్చే అవకాశాలు కోల్పోతావని ప్రిన్సిపాల్ హెచ్చరించాడు. ఈ ఘటన బెంగళూరులో జరిగింది. 
 
వివరాల్లోకి వెళితే బెంగళూరు సీవీ రామన్‌ రోడ్డులో ఉన్న కేంద్రీయ విద్యాలయ ప్రిన్సిపాల్‌ కుమార్‌ ఠాకూర్‌ తన పట్ల ఇలా అసభ్యంగా ప్రవర్తించాడంటూ 12వ తరగతి విద్యార్థిని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫిజిక్స్‌ టీచర్‌ షణ్ముగం తనను ప్రిన్సిపాల్‌ చాంబర్‌కు తీసుకెళ్లాడని, అక్కడ తనను తరచూ కలువాలంటూ అసభ్యంగా ప్రవర్తించాడని ఆమె తన ఫిర్యాదులో తెలిపింది. తనకు ప్రిన్సిపాల్‌ చాక్లెట్‌ ఇచ్చాడని, ఆ తర్వాత బయటకు వచ్చి చూస్తే బయట లైట్లు కూడా లేవని తెలిపింది.
 
సంచలనం సృష్టించిన ఈ లైంగిక వేధింపుల ఘటనపై ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. నిందితుడు కుమార్‌ ఠాకూర్‌కు జారీచేసిన బెయిల్‌ రద్దు చేయాలని ఇప్పటికే నోడల్‌ చైల్డ్‌హెల్ప్‌లైన్‌ అధికారులు బెంగళూరు డీసీపీకి లేఖ రాశారు.