మంగళవారం, 31 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 8 ఆగస్టు 2017 (15:13 IST)

రూపు రేఖల్లో నా మాజీ ప్రేయసివి.. మద్యం తాపించి.. పడక గదిలో నగ్నంగా చేసి.. శాడిస్ట్ భర్త టార్చర్

ఓ తాగుబోతు, శాడిస్ట్ భర్త కట్టుకున్న భార్యను చిత్రహింసలకు గురిచేశాడు. పీకల వరకు మద్యం తాపించి. పడక గదిలో నగ్నంగా చేసి.. ఆపై వికృత చేష్టలకు పాల్పడి వీడియో తీసిన శాడిస్ట్ భర్త సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చ

ఓ తాగుబోతు, శాడిస్ట్ భర్త కట్టుకున్న భార్యను చిత్రహింసలకు గురిచేశాడు. పీకల వరకు మద్యం తాపించి. పడక గదిలో నగ్నంగా చేసి.. ఆపై వికృత చేష్టలకు పాల్పడి వీడియో తీసిన శాడిస్ట్ భర్త సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. బెంగుళూరులో జరిగిన ఈ దారుణ వివరాలను పరిశీలిస్తే... 
 
‘అసెంచర్‌ సంస్థలో లక్షల రూపాయల వేతనం అందుకుంటున్న మేనేజర్‌ ఓ మహిళను బెంగుళూరుకు చెందిన ఓ వ్యక్తి వివాహ సంబంధాలను కుదిర్చే ఒక వెబ్‌సైట్‌లో చూసి ఏప్రిల్ 16వ తేదీన పెళ్లి చేసుకున్నాడు. మొదటి మూడు నెలలు అన్యోన్యంగా ఉన్నా.. తర్వాత భార్యను హనీమూన్‌ కోసం మారిషస్‌కు తీసుకెళ్లాక అతని వికృత చేష్టలు పరిధులు దాటడం మొదలైంది. అక్కడే ఆమెకు మద్యం తాగించేందుకు విఫలయత్నం చేశాడు. 
 
‘ఇది తాగితే మత్తు రాదు. ఏమీకాదు. హనీమూన్‌లో నిరాశ పరచవద్దు’ అంటూ ఆమెనుతో బలవంతంగా తాగించాడు. ఆ తర్వాత పోర్న్ మూవీస్ చూసేలా ఒత్తిడి చేశాడు. పిమ్మట అసహజ శృంగారంలో పాల్గొనాలంటూ ఒత్తిడి చేశాడు. ఈ దృశ్యాలను మొబైల్‌లో చిత్రీకరించుకుని దాచి పెట్టుకున్నాడు. హనీమూన్‌ నుంచి తిరిగి వచ్చినప్పటి నుంచి మద్యం తాగాలంటూ బెదిరించసాగాడు. ఈ వేధింపులు భరించలేని ఆ మహిళ కర్ణాటక మహిళా కమిషన్‌ను ఆశ్రయించింది. 
 
మద్యం తాగించి.. పడక గదిలో తన వికృతరూపాన్ని ప్రదర్శిస్తూ.. ఆ దృశ్యాలను మొబైల్ ఫోన్‌లో బంధించి నేరానికి ఒడిగడుతున్నాడంటూ ఆమె గుట్టు రట్టు చేయడంతో దిగ్భ్రాంతి చెందడం పోలీసుల‌ వంతైంది. ‘రూపు రేఖల్లో నా మాజీ ప్రేయసిని తలపిస్తున్నావు. నిన్ను అదే పేరుతో పిలుస్తాను. నిన్ను చూస్తే ఆమే గుర్తుకు వస్తోంది’ అంటూ సతాయిస్తున్నాడని బాధితురాలు తన ఫిర్యాదులో వాపోయారు. భర్త చెర నుంచి తనను రక్షించాలని వేడుకుంటోంది. 
 
పైగా, ఈ విషయాన్ని ఎవరికీ చెప్పుకోలేక కుమిలిపోతుంటే.. తాజాగా ఆయన కుటుంబ సభ్యులు పుట్టింటి నుంచి భారీగా నగదు తీసుకు రావాలని వేధిస్తున్నార‌ని వాపోయారు. వివాహ సమయంలో 800 గ్రాముల ఆభరణాలు, రూ.20 లక్షల నగదును లాంఛనంగా తీసుకుని ఇపుడు మరింత కావాలంటున్నారని ఆమె పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో వివరించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి వారిద్దరి మధ్య రాజీ కుదిర్చేందుకు ప్రయత్నిస్తున్నారు.