మంగళవారం, 25 ఫిబ్రవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 3 జనవరి 2017 (11:45 IST)

బెంగుళూరులో కీచకపర్వం... ఆ అర్థరాత్రి 'ఏ అమ్మాయిని వారు విడిచిపెట్టలేదు'

దేశ ఐటీ నగరం బెంగుళూరులో కీచకపర్వం కొనసాగింది. కొత్త సంవత్సర వేడుకల్లో భాగంగా డిసెంబర్ 31వ తేదీ అర్థరాత్రి కొందరు కీచకులు ఏ ఒక్క అమ్మాయినీ వదిలిపెట్టలేదు. బెంగుళూరు, ఎంజీ రోడ్డులో అమ్మాయిలు, మహిళలపై జ

దేశ ఐటీ నగరం బెంగుళూరులో కీచకపర్వం కొనసాగింది. కొత్త సంవత్సర వేడుకల్లో భాగంగా డిసెంబర్ 31వ తేదీ అర్థరాత్రి కొందరు కీచకులు ఏ ఒక్క అమ్మాయినీ వదిలిపెట్టలేదు. బెంగుళూరు, ఎంజీ రోడ్డులో అమ్మాయిలు, మహిళలపై జరిగిన కీచకపర్వం వివరాలు ఇపుడిపుడే వెలుగులోకి వస్తున్నాయి. 
 
న్యూ ఇయర్ పార్టీలో కొందరు యువకులు, ఇంకొందరు పురుషులు దారుణంగా ప్రవర్తించారు. ఏ అమ్మాయిని వారు విడిచిపెట్టలేదు. వారి ముందు నుంచి వెళుతున్న ప్రతి అమ్మాయిని తాకారు. బలవంతంగా దగ్గరకు లాక్కున్నారు. అభ్యంతరకరంగా తాకారు. కొంతమంది అమ్మాయిలను జుట్టుపట్టి ఈడ్చారు. వారి బట్టలు చింపేశారు. భయంతో ఏడుస్తూ పరుగెడుతున్నా వారిని వదలిపెట్టలేదు ఆ కామాంధులు. 
 
దీనిపై ఓ ప్రత్యక్షసాక్షి ఒకరు మాట్లాడుతూ... సాధారణంగా ఒక్కరిపై ఇద్దరిపై అయితే పోరాడగలం. కానీ, అక్కడ ఉంది వేలమంది సమూహం. ఏం చేయగలం. వారు ఉద్దేశపూర్వకంగా మహిళలను టార్గెట్‌ చేశారు. ఇది ఒక భారీ లైంగిక వేధింపుల ఘటనగా చెప్పవచ్చు. ప్రతి ఒక్కరు తాగి ఉన్నారు. ఒకరినొకరు నెట్టుకుంటున్నారు. ఎంత అసభ్యంగా చేశారంటే మాటల్లో చెప్పలేం. ఒక్క అమ్మాయిని కూడా విచిచిపెట్టలేదు. ఒక మహిళ ఏడుస్తుంటే చూశాను. ఆమెకు రక్తం కారుతోంది. మొత్తం గాయాలయ్యాయి. అది చూసి నాకు చాలా భయమేసింది. అంత దారుణంగా అక్కడ యువకులు ప్రవర్తించారు' అంటూ బోరున విలపించింది.