గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : బుధవారం, 26 జూన్ 2019 (15:17 IST)

ఎడమ చేయి విరిగితే.. కుడి చేయికి ఆపరేషన్ చేశారు... ఎక్కడ?

ఇటీవలికాలంలో బీహార్ రాష్ట్రం నిత్యం వార్తలకెక్కుతూనే ఉంది. ఇటీవల మెదడువాపు వ్యాధికి దాదాపు 150 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. అలాగే, మంగళవారం రాత్రి ప్రభుత్వ ఆస్పత్రిలో చనిపోయిన ఓ బాలుడు మృతదేహాన్ని తరలించేందుకు ఆంబులెన్స్‌ను ఆస్పత్రి వైద్యులు నిరాకరించారు. దీంతో ఆ బాలుడి మృతదేహాన్ని తండ్రి భుజంపై వేసుకుని ఇంటికి నడుచుకుంటూ వెళ్లాడు. 
 
ఈ క్రమంలో తాజాగా బీహార్ రాష్ట్రం మరోమారు వార్తలకెక్కింది. ముఖ్యంగా, రాష్ట్ర రాజధానిలో పేరుమోసిన వైద్య కాలేజీ ఆస్పత్రికి చెందిన వైద్యులు ప్రవర్తించిన తీరు ప్రతి ఒక్కరినీ విస్తుగొలిపేలా చేసింది. ఎడమ చేయి విరిగితే కుడిచేయికి ఆపరేషన్ చేశారు. ఈ చర్యతో ప్రతి ఒక్కరూ ముక్కున వేలేసుకునేలా చేసింది. 
 
ఫైజాన్ అనే బాలుడు చెట్టుపై నుంచి కిందపడ్డాడు. దీంతో ఎక్స్‌రే తీయగా, ఎడమ చేయి విరిగినట్టు తేలింది. దీంతో ఆ బాలుడు తల్లిదండ్రులు పాట్నాలోని ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకొచ్చారు. కానీ, వైద్యులు మాత్రం కుడిచేతికి కట్టు కట్టారు. నాకు ఎడమ చేతికి గాయం అయింది మొర్రో అంటూ బాలుడు మొత్తుకుంటున్నా ఏ ఒక్క వైద్యుడు వినిపించుకున్న పాపానపోలేదు. 
 
పైగా, కనీసం గాయానికి మందులు కూడా ఇవ్వలేదు కదా, కుడి చేతికి పెద్ద కట్టుకట్టేశారు. ఈ విషయం మీడియాలో రావడంతో ఒక్కసారిగా కలకలం చెరేగింది. వెంటనే రంగంలోకి దిగిన ఉన్నతాధికారులు ఈ నిర్వాకంపై విచారణకు ఆదేశించారు. ఈ ఘటనపై వివరణ ఇవ్వాలని వైద్యులను కూడా ఆదేశించారు. ఈ తరహా సంఘటనలు జరగడం, వెలుగులోకి రావడం ఈ రాష్ట్రంలో సర్వసాధారణమైపోయింది.