సోమవారం, 27 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 6 జులై 2018 (09:17 IST)

తుపాకీతో కాల్చుకో.. బతికితే పెళ్లి చేస్తా... చచ్చావే అనుకో....

తన కుమార్తెను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన ఓ ప్రియుడి ప్రాణాలను ఆ యువతి తండ్రి బలిగొన్నాడు. తన కుమార్తెపై ఉన్న ప్రేమను నిరూపించుకోవాలంటూ ఓ పరీక్ష పెట్టాడు. ఈ పరీక్షలో నెగ్గినట్టయితే నా కుమార్తెనిచ్చ

తన కుమార్తెను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన ఓ ప్రియుడి ప్రాణాలను ఆ యువతి తండ్రి బలిగొన్నాడు. తన కుమార్తెపై ఉన్న ప్రేమను నిరూపించుకోవాలంటూ ఓ పరీక్ష పెట్టాడు. ఈ పరీక్షలో నెగ్గినట్టయితే నా కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తాను.. చచ్చావే అనుకో వచ్చే జన్మలో ఇద్దరూ ఒక్కటవుతారు అంటూ కండీషన్ పెట్టారు. అంతే ఆ ప్రేమికుడు తుపాకీతో కాల్చుకున్నాడు. ఆ మరుక్షణమే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భోపాల్‌లో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే..
 
భోపాల్‌కు చెందిన బీజేపీ యువ మోర్చా లీడర్‌ అతుల్‌ లోఖండే. 13 ఏళ్లుగా ఓ బ్యాంకు ఉద్యోగినితో ప్రేమాయణం నడుపుతున్నాడు. పెళ్లి అనేసరికి యువతి తండ్రి.. లోఖండేకు షరతు పెట్టాడు. 'నీది నిష్కళంకమైన ప్రేమే అయితే తపంచాతో (తుపాకీ) కాల్చుకో! నువ్వు బతికితే పెళ్లిచేస్తా. చనిపోయావే అనుకో. వచ్చే జన్మలో ఇద్దరూ ఒకటవుతారు' అని చెప్పాడు. దీంతో ఆయన ఎదుటే లోఖండే తనను తాను కాల్చుకున్నాడు. అంతే ఆ క్షణమే ప్రాణాలు కోల్పోయాడు. అతని చర్య ద్వారా తన ప్రియురాలిపై తనకు 'చచ్చేంత ప్రేమ' అని నిరూపించాడు.