శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 18 జులై 2017 (08:26 IST)

వరకట్నం.. తాళికట్టు వేళ ఎస్‌యూవీ కారు కావాలన్న వరుడు.. పెళ్ళిని రద్దు చేసుకున్న వధువు

వరకట్నం వేధింపులు రోజురోజుకీ పెచ్చరిల్లిపోతున్నాయి. పెళ్లికి ముందే వరుడు కారు కావాలని లేదంటే వధువు మెడలో తాళికట్టబోనని భీష్మించుకుని కూర్చోవడంతో సీన్ రివర్సైంది. తనకు అత్తింటివారు కారును కానుకగా ఇస్తే

వరకట్నం వేధింపులు రోజురోజుకీ పెచ్చరిల్లిపోతున్నాయి. పెళ్లికి ముందే వరుడు కారు కావాలని లేదంటే వధువు మెడలో తాళికట్టబోనని భీష్మించుకుని కూర్చోవడంతో సీన్ రివర్సైంది. తనకు అత్తింటివారు కారును కానుకగా ఇస్తేనే వధువు మెడలో తాళికడతానని పట్టుబట్టడంతో ఆగ్రహించిన వధువు పెళ్లి రద్దుచేసుకుని ఇంటికి వెళ్ళిపోయింది. ఈ ఘటన యూపీలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే... యూపీలోని షహరన్‌పూర్ పట్టణంలోని ఓ కళ్యాణ మండపంలో పెళ్లి ఏర్పాటైంది. బంధువులు, స్నేహితులు, వందలాది మంది బంధుమిత్రులు పెళ్ళికి హాజరయ్యారు. 
 
భాజాభజంత్రీల మధ్య మరికొద్దిసేపట్లో వరుడు వధువు మెడలో తాళి కట్టాలి. అయితే తనకు పెద్ద కారును బహుమతిగా ఇస్తేనే వధువు మెడలో తాళికడతానని వరుడు డిమాండ్ చేశాడు. పెళ్లి కాసేపట్లో ఉందన్న తరుణంలో వరుడు ఇలా కారుకావాలని భీష్మించుకుని కూర్చోవడం సరికాదని వధువు కుటుంబీకులు ఎంత చెప్పినా.. ప్రయోజనం లేకపోయింది. వరుడు కారు కావాల్సిందేనని మొండిగా పట్టుబట్టాడు. ఇదంతో ఓపికచూసిన వధువు ఇక నిగ్రహం కోల్పోయింది. కారు కోసం మొండిగా ప్రవర్తించే వరుడు తనకు అక్కర్లేదని.. వధువు పెళ్లిని రద్దు చేసుకుని పెళ్లి మండపం నుంచి ఇంటికి వెళ్లిపోయింది.