ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 18 నవంబరు 2016 (13:26 IST)

నోయిడా రేప్‌పై నోరు పారేసుకున్న ఆజంఖాన్.. బేషరతుగా క్షమాపణ చెప్పాల్సిందేనన్న సుప్రీం..

జూలై 29న నోయిడాకు చెందిన ఒక కుటుంబం కారులో ప్రయాణిస్తుండగా దానిని అడ్డుకున్న కొందరు దుండగులు తల్లీకూతుళ్లపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన రాజకీయ కుట్ర అని ఆరోపిస్తూ ఆజంఖాన్ నాడు వివాదాస్పద వ్యాఖ్యల

జూలై 29న నోయిడాకు చెందిన ఒక కుటుంబం కారులో ప్రయాణిస్తుండగా దానిని అడ్డుకున్న కొందరు దుండగులు తల్లీకూతుళ్లపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన రాజకీయ కుట్ర అని ఆరోపిస్తూ ఆజంఖాన్ నాడు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో, ఈ విషయమై ఆజంఖాన్‌ను విచారించాలని బాధిత బాలిక సుప్రీంకోర్టును ఆశ్రయించింది.  
 
నోయిడా అత్యాచార ఘటనపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన యూపీ మంత్రి ఆజంఖాన్‌పై విచారణ జరిపిన సుప్రీం కోర్టు.. ఆజంఖాన్ క్షమాపణలు చెప్పాలని ఆదేశాలు జారీ చేసింది. జస్టిస్ దీపక్ మిశ్రా, సి.నాగప్పన్ లతో కూడిన ధర్మాసనం ఈమేరకు తీర్పును ఇచ్చింది. ఒక ప్రజాప్రతినిధి ఇటువంటి వ్యాఖ్యలు చేయడం తగదని, బేషరతుగా క్షమాపణలు చెప్పాలని ఆదేశించింది. 
 
బాధితురాలు చదువుకునేందుకు వీలుగా దగ్గర్లోని పాఠశాలలో ప్రవేశం కల్పించాలని ఉన్నత న్యాయస్థానం యూపీ ప్రభుత్వానికి సూచించింది. ఆమె అడ్మిషన్‌, చదువుకు అయ్యే ఖర్చులన్నీ ప్రభుత్వమే భరించాలని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేశారు.