పళనిస్వామి జైలుపక్షి చేతిలోని కీలుబొమ్మ... దీనికన్నా చనిపోవడమే మేలు : కట్జూ
తమిళనాడు ముఖ్యమంత్రి కుర్చీలో ముద్దాయి శశికళ అనుచరుడు ఎడప్పాడి పళనిస్వామి కూర్చోవడంపై సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి మార్కండేయ కట్జూ విమర్శించారు. ఓ జైలుపక్షి చేతిలోని కీలుబొమ్మను తమిళనాడుకు ముఖ్యమంత్
తమిళనాడు ముఖ్యమంత్రి కుర్చీలో ముద్దాయి శశికళ అనుచరుడు ఎడప్పాడి పళనిస్వామి కూర్చోవడంపై సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి మార్కండేయ కట్జూ విమర్శించారు. ఓ జైలుపక్షి చేతిలోని కీలుబొమ్మను తమిళనాడుకు ముఖ్యమంత్రిని చేశారంటూ ఆ రాష్ట్ర ఎమ్మెల్యేలు, ప్రజలపై మండిపడ్డారు.
పౌరుషం గల తమిళ ప్రజలుగా మీరు దీనిని అంగీకరించడం, అచేతనులుగా ఉండటం సిగ్గుచేటన్నారు. కుట్రకు దాసోహం కావడాన్ని మీ పితృదేవతలు హర్షించరని పేర్కొన్నారు. ఈ ముఖ్యమంత్రికి శిరసు వంచడం మీకు అవమానం కాదా?
గతంలో నేనొక తమిళుడినంటూ గర్వంగా చెప్పుకొన్నాను. కానీ, పళనిస్వామి సీఎంగా ఉన్నంతకాలం తమిళ వీరాభిమానిగా ఉండలేను కదా.. దీనికన్నా చనిపోవడమే మేలంటూ ఘాటైన పదాలతో ట్వీట్ చేశారు.