1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శుక్రవారం, 23 మే 2025 (13:51 IST)

అతివేగంగా చెట్టును ఢీకొట్టిన కారు రెండు ముక్కలైంది: ముగ్గురు మృతి

car accident
భోపాల్ సెహోర్ రోడ్డులో అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగం వారి ప్రాణాలను తీసింది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భైసాఖేడిలోని కృషి మండి సమీపంలోని పెట్రోల్ పంప్ సమీపంలో కారు చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో కారు రెండు ముక్కలైంది. కారులో ప్రయాణిస్తున్న నలుగురు యువకులలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా, ఒక యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు.
 
చెట్టును ఢీకొట్టిన తర్వాత కారు రెండు ముక్కలుగా విరిగిపోయింది, కారు పూర్తిగా దెబ్బతింది. ఖజురి వైపు నుంచి వస్తున్న కారు అదుపు తప్పి రోడ్డు పక్కనే వున్న చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో చనిపోయిన ముగ్గురు యువకులతో పాటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మరో యువకుడు అందరూ బైరాగఢ్ నివాసితులుగా చెబుతున్నారు.