ఆదివారం, 30 మార్చి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 27 మార్చి 2025 (09:49 IST)

ఐశ్వర్య కారును ఢీకొన్న బస్సు.. తప్పిన పెను ప్రమాదం..

Aishwarya Rai
బాలీవుడ్ నటి ఐశ్వర్య రాయ్ బచ్చన్‌కు ప్రమాదం తప్పింది. ఆమె ప్రయాణిస్తున్న కారును ప్రభుత్వ బస్సు ఒకటి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆమె కారు స్వల్పంగా ధ్వంసమైంది. అయితే, ఐశ్వర్యకు మాత్రం పెద్ద ప్రమాదమేమీ జరగలేదని ఆమె మీడియా విభాగం వెల్లడించింది. 
 
ఈ ఘటనకు సంబంధించి ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో పలువురు అభిమానులు ఐశ్వర్యకు ఏమైందోనని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రమాద సమయంలో ఆమె కారులో లేరని తెలియడంతో ఊపిరి పీల్చుకుంటున్నారు. 
 
సోషల్ మీడియాలో కారు ప్రమాదానికి సంబంధించిన వార్త వైరల్ కావడంతో ఐశ్వర్యా రాయ్ టీమ్ స్పందించింది. ఇది పెద్ద ప్రమాదం కాదని, స్థానిక మీడియాకు తెలియజేసింది.